- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్ అంతటికీ సానియా మీర్జానే వదిన: మహిర
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ నటి మహిరా ఖాన్ ‘పాకిస్తాన్ అంతటికీ సానియానే వదిన’ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా కారణంగా అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. మరికొన్ని రోజుల్లో షోయబ్ మాలిక్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ క్రమంలో పాక్ నటి మహిర ఖాన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేశాడు.
సరదాగా సాగిన ఈ చాట్‌లో సానియా మీర్జా ప్రస్తావన తీసుకువచ్చి నవ్వులు పూయించారు. ఈ చాట్‌లో షోయబ్ తన మాటలతో మహిరాను ఫ్లర్ట్ చేయడానకి ట్రై చేశాడు. ‘మనిద్దరి వయసు అయిపోతుంది. అందుకే మన లైవ్ కనెక్ట్ అవడానికి టైం పట్టింది’ అని మహిర అన్నది. దీనికి సమాధానంగా ‘నా వయసు అయిపోతుండవచ్చు. కానీ, నీ అందం, వయసు ఏ మాత్రం తగ్గడం లేదు’ అని మాలిక్ అన్నాడు. ఈ పొగడ్తలకు సిగ్గుపడిన మహిర ‘ఏంటీ.. బాబీ ఈ లైవ్ సెషన్ చూడటం లేదా’ అని ప్రశ్నించింది. ‘సానియా చూస్తున్నది. కానీ, ఆమె నాకు బాబీ కాదు భార్య’ అని బదులిచ్చాడు. దీనికి మహిర ‘నేనన్నది నీకు వదిన అని కాదు. ఆమె పాకిస్తాన్ మొత్తానికే వదిన’ అని బదులిచ్చింది.
వీరి చాటింగ్ చూస్తున్న సానియా ‘చూస్తున్నా.. మీరేం మాట్లాడుకుంటున్నారో అన్నీ వింటున్నా’ అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ చాట్ వైరల్‌గా మారింది. ఇక పాకిస్తాన్ జట్టు ఆదివారం మాంచెస్టర్ బయలుదేరనుంది. భార్య, కుమారుడితో నెల రోజులు గడిపిన తర్వాత వచ్చే నెల 24న షోయాబ్ మాలిక్ ఇంగ్లండ్‌లో ఉన్న జట్టుతో చేరుతాడు.