అక్కడ హౌస్‌కీపింగ్ ఉద్యోగానికి రూ. 18 లక్షల శాలరీ

by Shyam |
అక్కడ హౌస్‌కీపింగ్ ఉద్యోగానికి రూ. 18 లక్షల శాలరీ
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఏ దేశంలోనైనా.. పనిమనుషులకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇంటి పనులతో పాటు వంట బాగా చేయగలిగితే చాలు.. పనిమనిషి జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే జీతం మాత్రం అంతంతమాత్రంగానే (రూ. 3 వేల నుంచి ఐదు వేల వరకు) ఉంటుంది. కొన్ని దేశాల్లో మాత్రం రూ. పది వేల నుంచి యాభై వేల వరకు కూడా ఉండే చాన్స్ ఉంది. కానీ బ్రిటన్ రాణి ఎలిజిబెత్ ఇంట్లో హౌస్ కీపర్ పోస్టుకు ఎంత జీతం ఇస్తారో తెలుసా? వాళ్లకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలో తెలుసా?

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో హౌస్ కీపర్‌గా జాయిన్ కావాలంటే ఆషామాషీ విషయమేం కాదు. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ విండ్సర్ క్యాజిల్‌లో ‘హౌస్ కీపింగ్’ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ పోస్ట్ కోసం ‘ద రాయల్ హౌస్‌హోల్డ్’ తమ అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా ఓ ప్రకటన చేసింది. లెవల్ 2 అప్రెంటిస్‌గా ఆ ఉద్యోగాన్ని పేర్కొనగా.. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు విండ్సర్ క్యాజిల్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అదే విధంగా పనిని బట్టి బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కూడా వర్క్ చేయాలి.

అర్హులకు తప్పకుండా మ్యాథ్స్, ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. ఈ పనిలో చేరేందుకు ముందు 13 నెలల పాటు శిక్షణ పొందాలి. శిక్షణలో అర్హత పొందినవారికే ఆ ఉద్యోగం వరిస్తుంది. క్లీనింగ్ పనులతో పాటు ఇంటరీయర్, డెకరేటివ్ ఐటెమ్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. అలంకరణ పనుల్లో అత్యుత్తమ పనితీరును కనబర్చాలి. వీటికి అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలో పాల్గొనాలని రాచకుటుంబం ప్రకటించింది. ట్రైనింగ్ పూర్తి చేసుకుని బాధ్యతలు స్వీకరించే పని మనిషికి తొలుత నెలకు సుమారు రూ.18 లక్షల (19,140.09 యూరోలు) జీతం అందిస్తామని పేర్కొంది. అంటే.. మున్ముందు ఈ జీతం మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట.

ఈ ‘హౌస్‌కీపర్’ ఉద్యోగం సంపాదించిన వ్యక్తికి ఏడాదికి 33 సెలవులు ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రావెలింగ్ తదితర అలవెన్సులు కూడా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed