అమ్మాయిలు డోంట్ వర్రీ.. ఐయామ్ సింగిల్‌ : మీజాన్

by Jakkula Samataha |
meezan-jaffar
X

దిశ, సినిమా : యంగ్ యాక్టర్ మీజాన్.. ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని స్పష్టం చేశాడు. కొంతకాలంగా అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో తనను లింకప్ చేస్తూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తను సింగిల్‌‌గానే ఉన్నానని చెప్పిన మీజాన్.. ఈ విషయంపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని, ఏం చెప్పినా అది నెగెటివ్‌గానే పొర్ట్రెయిట్ అవుతోందని అసహనం వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇలాంటి రిలేషన్‌షిప్స్‌ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో తెలియడం లేదని వాపోయాడు.

ఈ సందర్భంగా ఫిమేల్ ఫ్యాన్స్‌కు, ప్రత్యేకించి తన రిలేషన్‌షిప్ వార్తలతో నిరాశపడుతున్నవారికి.. ‘ఇవన్నీ ఫేక్ వార్తలు, ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నా, నా ఫోకస్ మొత్తం కెరీర్‌పైనే ఉంది’ అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు రీసెంట్‌గా తను పెళ్లి సంబంధం కోసం అప్రోచ్ అయినట్టు వచ్చిన వార్తలు విని, తల్లితో కలిసి నవ్వుకున్నానని చెప్పుకొచ్చాడు. 2019లో వచ్చిన ‘మలాల్’ తన డెబ్యూ మూవీ కాగా, ఇటీవలే రిలీజైన ‘హంగామా2’లో కనిపించాడు మీజాన్.

Advertisement

Next Story