స్వీట్ షాపులో వివాహేతర సంబంధం గొడవ

by Anukaran |   ( Updated:2020-08-26 01:39:48.0  )
స్వీట్ షాపులో వివాహేతర సంబంధం గొడవ
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న వ్యక్తి తన మార్గం గుండా తానే వెళ్లిపోవాలి.. కానీ, ఎక్కడ కూడా తొందరపడ్డా వాహనం బోల్తా పడుతది. అంతేకాదు.. ఆ ప్రమాదం వల్ల ఇంకెందరికో నష్టం వాటిల్లుతది. ఇలా ఒకరి అజాగ్రత్త వల్ల ఇటు ఆర్థికంగా నష్టం, అటు అవతలి వారికి నష్టం. మొత్తంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తి, ఏ సంబంధం లేని వ్యక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతది. కొన్నికొన్నిసార్లు ఇలాంటి ఘటనలకు ఏ సంబంధంలేని వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకోల్లుగా మనం చూసి ఉంటాం.

తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ. నగరంలోని మధురానగరల్‌లో ఉన్న ఓ స్వీట్ షాపులో బుధవారం శ్రీనివాస్, గౌస్ అనే ఇద్దరి వ్యక్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలో గౌస్ అనే వ్యక్తి శ్రీనివాస్‌ను కొట్టి చంపాడు. వీరి గొడవకు గల కారణాలను అన్వేషిస్తే వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. చూశారా.. ఇద్దరి మధ్య ఐదు నిమిషాల ఆనందం మరో వ్యక్తిని బలి తీసుకుంది. సో.. ఇలా వ్యవహరించేవారు ఇక నుంచైనా సవ్య దిశలో నడుచుకుంటే బెటర్. లేకపోతే వారికి, వారి వల్ల ఇతరులకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఎప్పటికైనా తప్పు తప్పే. ఆ తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed