- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పాజిటివ్ రిపోర్టుంటేనే చేర్చుకుంటాం’.. ఆస్పత్రుల కొత్త మెలికతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
న్యూఢిల్లీ: ‘పొద్దున్నుంచి ఆస్పత్రుల వెంట తిరిగి తిరిగి అలసిపోయానయ్యా. ఎక్కడికెళ్లినా బెడ్లు లేవు, మేం చేర్చుకోలేమని అంటున్నారు. చేర్చుకొని ఏదో ఒక మూలన నేల మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేసినా చాలయ్యా.. తనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. దయచేసి ఆమెను అడ్మిట్ చేసుకోండయ్యా.. మీ కాళ్లు మొక్కమన్నా మొక్కుతా. కానీ ఇక్కడ్నుంచి వెళ్లమని మాత్రం చెప్పొద్దు. మీకు పుణ్యముంటది..’ కొవిడ్ సోకిన తన భార్యను రక్షించుకోవడానికి ఓ భర్త పడుతున్న తపన ఇది. ఢిల్లీకి చెందిన అస్లాం ఖాన్.. కరోనా వచ్చిన తన భార్యను బైక్ మీద కూర్చోబెట్టుకుని రోజంతా తిరిగినా ఒక్క ఆస్పత్రలో కూడా ఆమెను చేర్చుకోలేదు. కారణం ఆమెకు కరోనా రిపోర్టులో నెగిటివ్ రావడం. పాజిటివ్ రిపోర్టు ఉంటేనే చేర్చుకుంటామని పలు ఆస్పత్రులు మెలికపెడుతున్నాయి.
దేశంలో సెకండ్ వేవ్ కరోనాలో లక్షణాలు లేని (అసింప్టమేటిక్) కేసులే ఎక్కువగా వస్తున్నాయని, అవే కొంప ముంచుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నా పలు ఆస్పత్రులు మాత్రం పాజిటివ్ రిపోర్టులు అడుగుతుండటం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అస్లాం ఖాన్ తన భార్యను ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా.. కరోనా పాజిటివ్ రిపోర్టు లేదని అతడిని వెనక్కి పంపించారు. చివరికి లోకనాయక్ జై ప్రకాశ్ (ఎల్ఎన్‌జేపీ) హాస్పిటల్‌కు వచ్చి వేడుకున్నాడు. అక్కడా అదే తిరస్కారం. పలుమార్లు టెస్టు చేయించినా ఆమెకు నెగిటివ్ వచ్చింది. చాలా మందిలో పాజిటివ్ రాకున్నా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ (ఊపిరితిత్తుల సమస్య) వస్తున్నాయని, శ్వాస అందక వందలాది మంది చనిపోతున్నారని చెబుతున్నా ఆస్పత్రులు మాత్రం పాజిటివ్ రిపోర్టును కోరుతుండం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. దీంతో కొవిడ్ బాధితుల కుటుంబసభ్యులు వారిని వెంటబెట్టుకుని బయట ఏదైనా ల్యాబ్‌లకు వెళ్లి ఎక్స్‌రేలు, సిటి స్కాన్‌ల కోసం పరిగెత్తుతున్నారు.
నెగిటివ్ రిపోర్టు ఉంటే చేర్చుకోవడం లేదు : వినోద్ కుమార్
నా తల్లి సంతోషి దేవికి 60 ఏళ్లు. ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. అంతేగాక ఆక్సిజన్ లెవల్స్ ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. ఎల్ఎన్‌జేపీకి తీసుకొచ్చినా పాజిటివ్ రిపోర్టు లేదని రెండున్నర గంటల పాటు ఆమెను చేర్చుకోలేదు. చివరికి ఆమె పరిస్థితి అర్థమై అడ్మిట్ చేసుకున్నారు. ఇక్కడ వేచిఉన్నవారిలో చాలా మందిది ఇదే పరిస్థితి.