కరోనాతో వ్యక్తి మృతి.. జేబులో డబ్బు, బంగారం చోరీ.. వీడియో వైరల్

by Sumithra |   ( Updated:2024-06-02 16:28:21.0  )
కరోనాతో వ్యక్తి మృతి.. జేబులో డబ్బు, బంగారం చోరీ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతోంది. వేల సంఖ్యలో కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది శ్రమిస్తుంటే.. అక్కడక్కడా కొందరు వృత్తికి చెడ్డపేరు తెచ్చేలా చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ధులేలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి జేబులోని డబ్బు, నగలు ఆసుపత్రి సిబ్బంది దొంగిలించారు. అనంతరం డబ్బు, నగలు పోయిన విషయాన్ని ఆ వ్యక్తి బంధువులు గుర్తించి ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. సీసీ టీవీ కెమేరా ఫుటేజి పరిశీలించిన అనంతరం అసలు విషయం బయటపడింది. దీంతో బాధిత కుటుంబీకులే కాకుండా నెటిజన్లు ఆసుపత్రి సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story