- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్యూరిటీ గార్డుగా ‘క్యాట్’
దిశ, వెబ్‌డెస్క్ :
బ్రెజిల్‌లోని ఓ స్ట్రీట్ డాగ్.. ప్రతీరోజు ఓ కార్ షోరూమ్ దగ్గరకు వస్తూ, పోతూ ఉండటంతో సదరు షోరూమ్ నిర్వాహకులు ఆ కుక్కను ‘సేల్స్ ఆఫీసర్’గా నియమించుకున్నట్లు ‘దిశ’లో ఇదివరకే చెప్పుకున్నాం. అచ్చం ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోనూ జరిగింది. కానీ ఈ సారి కుక్క కాదు.. పిల్లికి ఓ హాస్పిటల్ నిర్వాహకులు ఉద్యోగం ఇచ్చారు.
మెల్‌బోర్న్‌లోని రిచ్‌మండ్‌లో ‘ఎప్‌వర్త్’ అనే హాస్పిటల్ ఉంది. అక్కడికి సంవత్సరం కాలంగా ప్రతీరోజు ఓ పిల్లి వస్తూనే ఉంది. కాగా ఆ పిల్లి హార్డ్‌వర్క్, ప్రిజర్వెన్స్, టైమ్ సెన్స్ ఆస్పత్రి వర్గాలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ పిల్లికి ఉద్యోగం ఇవ్వడానికి అన్ని అర్హతలున్నాయని భావించిన మేనేజ్‌మెంట్.. వెంటనే దానికి ‘సెక్యూరిటీ గార్డు’గా జాబ్ ఇచ్చేసింది. అంతేకాదు, దాని మెడలో ఓ ఐడీ కార్డు కూడా వేశారు. ఇంతకీ దాని పేరంటంటే.. ‘ఎల్‌వుడ్’. ఈ ‘ఎల్‌వుడ్’ అనే పిల్లి ఎప్పుడూ ఎరిన్ స్ట్రీట్‌లోని హాస్పిటల్ ఎంట్రన్స్ పక్కన గల రోడ్డుపైనే ఉంటూ.. ఆస్పత్రికి వచ్చే పేషెంట్స్, స్టాఫ్, డాక్టర్స్‌ను గ్రీట్ చేస్తుంటుంది. కాగా, ‘పిల్లిని ఆస్పత్రి స్టాఫ్‌గానే పరిగణిస్తున్నామని, జాబ్ టైమింగ్స్ అయిపోగానే ‘ఎల్‌వుడ్’ తనకు ఇష్టమైన ప్లేస్‌లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చని హాస్పిటల్ యాజమాన్యం కూడా కన్‌ఫర్మ్ చేయడం విశేషం.
నెటిజన్లతో పాటు పెట్, క్యాట్ లవర్స్ ఈ న్యూస్ పట్ల ఎంతో సంతోషంగా ఉండగా.. కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ‘మేము కూడా ప్రతీరోజు హాస్పిటల్ ఆవరణలోనే ఉంటున్నాం, మాకు కూడా జాబ్ ఇవ్వొచ్చు కదా’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఫారెన్ అండ్ కామన్‌వెల్త్ ఆఫీస్(ఎఫ్‌సీఓ)లో నాలుగేళ్ల పాటు ఉద్యోగం చేసి గ్రాండ్‌గా పదవీ విరమణ పొందిన ‘పామర్‌స్టన్’ అనే పిల్లి గురించి కూడా ఇటీవలే ‘దిశ’లో చెప్పుకున్నాం. ఆ ఆఫీసులో ఎలుకల్ని పట్టేందుకు ఆ పిల్లిని నియమించిన విషయం తెలిసిందే.