- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగాది పంచాంగం : ఈ రాశి వారికి గడ్డుకాలం.. అన్నింటా చుక్కలే
దిశ, ఫీచర్స్ : శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది. వీరి ఆదాయ,వ్యయాల గురించి తెలుసుకుందాం.
ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2
సింహ రాశి వారికి గురుడు పదో స్థానంలో, రాహువు అష్టమ స్థానంలో ఉండటం వలన ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరంభం నుంచే కష్టాలు తప్పవు. ప్రతి చిన్న పనికి కూడా వీరు పోరాటమే చేయాల్సి వస్తుంది. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోతారు. కళాకారులకు, రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి ఈ సంవత్సరం గడ్డుకాలమే అని చెప్పవచ్చు. కానీ ఈ సంవత్సరం సింహరాశి వారి విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మంచి ర్యాంకులు పొందుతారు. ఇక ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమ విషయాలు అనుకూలించవు. అదే విధంగా శారీరక శ్రమ వీరికి ఈ సంవత్సరం అధికం అవుతుంది. ఓరల్‌గా చెప్పాలంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి కాస్త ఇబ్బందికరమే, కానీ ఆర్థికంగా బాగుంటుంది. రుణ సమస్యలు ఉండవు.మీ తెలివితేటలు, ఆత్మవిశ్వాసం వలన కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.