Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఇవే.. (7-22-2024)

by Hamsa |   ( Updated:2024-07-21 23:00:53.0  )
Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఇవే.. (7-22-2024)
X

మేష రాశి: ఈ రాశి వారు ఎనర్జీ మీరు చేసే పనులకు ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజకులు అవుతారు. అలాగే ఆర్థిక ప్రయోజన ఆలోచనలతో వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే సాయంత్రం సమయాల్లో మీకు కావాల్సిన వాళ్లతో వినోదాత్మక సమయాన్ని గడుపుతారు. కొంత ఖాళీ సమయంలో నచ్చిన పనిని చేయాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇంటికి అతిథులు రావడంతో పనికి ఆటంకం కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి గురించి ఈ రోజు ఓ ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకుని మీ నిజమైన ఏంజెల్ అనే భావనలో పడిపోతారు.

వృషభ రాశి: ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా కానీ తొందరగా అయిపోతుంది. మీ పెట్టుబడులు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి సీక్రెట్‌గా ఉంచడం మంచిది. ఈ రాశిలో ఉన్న వారి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. అలాగే మీరు చెప్పిన మాట వినాలని అనుకుంటారు. ఈరోజు మీరు మీ ఇంటిని శుభ్రం చేయడానికి అలాగే కొన్ని వస్తువులు కొనడానికి ప్లాన్ చేసుకుంటారు. కానీ మీరు బిజీగా ఉండటం వల్ల ఖాళీ సమయం ఉండకపోవడంతో అనుకున్నది చేయలేరు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు.

మిథున రాశి: వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు పెంచుకునేందుకు ఇదే అద్భుతమైన సమయం. కాబట్టి లాభాలు పెంచుకునేందుకు ఇతర దేశాల్లో ఉన్న సన్నిహితులతో మాట్లాడటం మంచిది.మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోతుంది.

కర్కాటక రాశి: మీ బంధువులు కొంతమంది ప్రవర్తనతో మీకు చిరాకు తెప్పిస్తారు. కానీ మీరు ప్రశాంతతను కోల్పోకుండా కోపం తెచ్చుకోకుంటే ఉండాలి. అలా కాకుండా నిగ్రహం కోల్పోతే అనర్థాలకు దారితీస్తుంది. చదువుకోకుండా ఆటల్లో ఇతర వాటిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులను బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ఫ్యామిలీ సంతోషం కోసం మీరు రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చు. మీ భాగస్వామితో బంధం చక్కగా సాగుతున్నప్పటికీ ఒక్కసారి మీ ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో వాదనకు దారితీసి సమస్యలను కొని తెస్తుంది.

సింహ రాశి: మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, చివర్లో లాభాలను చూస్తారు. మీకు అత్యంత అవసరమైన సమయంలో మీ స్నేహితుడు మీకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు. వారు మీకు నచ్చడంతో బంధాన్ని ఏర్పరుచుకోవాలని చూస్తారు. ఆఫీసులో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు. ఏదైన పని ప్రారంభించే ముందు, ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు పాటించండి. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు పలు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.

కన్యా రాశి : పలు టెన్షన్ వల్ల ఆందోళనకు గురవుతుంటారు. కానీ మీ కుటుంబ సభ్యుల సలహా వింటే సమస్యకు పరిష్కారం లభించి శుభవార్త వింటారు. డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు చేయడం వల్ల సక్సెస్ పొందుతారు. ఈ బిజీ బిజీ లైఫ్‌లో చిన్న ట్రిప్ ప్రశాంతతను ఇస్తుంది. మీరు చెప్పిన మాటలు, కొన్ని విషయాలు మీ ప్రేయసి/ప్రియుడు బాధకు కారణమవుతాయి. దీంతో వారు మీపై కోపాన్ని తెచ్చుకుంటారు. అలా కాకూడదంటే మీ తప్పు తెలుసుకుని వారిని కూల్ చేయండి. ఈరోజు మీరు కార్యాలయంలో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు కొనితెచ్చుకోవడం కంటే సైలెంట్‌గా ఉండటం బెటర్.

తులా రాశి: ఈ రోజు మీరు వేసే ట్రిప్స్, గెట్ టుగెదర్ వంటివి మిమ్మల్ని సంతోష పెడతాయి. వ్యాపారంలో మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని అందిస్తాయి. అతి ప్రీతికరమైన అధికారులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు ప్రేమ దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.

వృశ్చిక రాశి: హ్యాప్పీ లైఫ్ కోసం మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. అలా కాకుండా పలు ఆటలు ఆడి ధనాన్ని పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. మీ ప్రేమ వ్యవహారం లోకి ఎవరో ఒకరు రావచ్చును. వారు మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెడుగా చెప్పి సమస్యను తీసుకువస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడప లేనంతగా బిజీ గా మారవచ్చు. కానీ అది మీరు అర్థం చేసుకుని మెలగడం వల్ల బంధం బలపడుతుంది.

ధనుస్సు రాశి: ఈరోజు ఎనర్జీ గా ఉన్నప్పటికీ కొంత పని ఒత్తిడితో చిరాకు వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలని బయటకు వెళ్లి ధనాన్ని ఖర్చు చేస్తారు. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే అనుభూతి చెందుతారు. ఆఫీస్ లో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది.

మకర రాశి: నేడు ఆర్థిక సమస్యలు తగ్గి ప్రయోజనాలు పొందుతారు. అలాగే స్నేహితులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కానీ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు. కానీ వారితో మీరు పంచుకోక పోవడం వల్ల నిరాశ చెందుతారు. ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు పెంచుకోవడానికి అద్భుతమైన సమయం ఇది.

కుంభ రాశి: నేడు కొన్ని కారణాల వల్ల మీరు ప్రేమించిన వ్యక్తి మీపై ద్వేషాన్ని పెంచుతాయి. కాబట్టి వారిపై నిర్లక్ష్యంగా ఉండకుండా కాస్త సమయాన్ని కేటాయించి మీ సమస్యను వివరించండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందడంతో పాటుగా ఉన్నత స్థాయిలో ఉంచుతారు. అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి మంచి సమయం ఇదే. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.

మీన రాశి: మీ స్నేహితులను అపార్థం చేసుకోవడం వల్ల గొడవలతో దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఊహించని లాభాలను పొందుతారు. మీకు కనుక వివాహం అయ్యి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈ రోజు మీకు, మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదని కంప్లైంట్ చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి శాంతి పరుస్తుంది.

Advertisement

Next Story