Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-08-08 18:45:53.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : ఈ రాశి వారు నేడు అధికంగా ఖర్చులు చేస్తుంటారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలు లాభాలను తీసుకొచ్చి పెడుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి : విద్యార్థులకు నేడు కలిసి వచ్చే రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఇంట్లో కలహాలు మీకు మానసిక అశాంతిని కలిగిస్తుంది.ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు.

మిథున రాశి : ఈరోజు మీకు ఆఫీసులో అద్భుతమైన రోజుగా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. భాగస్వాములతో వ్యాపారం చేసే ముందు ఆలోచించడం మంచిది. ఆదాయం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కర్కాటక రాశి : కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. శ్రీమతితో తగిన సంభాషణలు, సహకారము బంధాన్ని బలోపేతం చేస్తాయి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది.

సింహ రాశి : ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. మీప్రియమైనవారు వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు.

కన్యా రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు.

తుల రాశి : చాలా కాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయట పడుతారు. చంద్రుని యొక్క స్థాన ప్రభావం వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు.మీరు మీ ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవాలంటే మీ జీవితభాగస్వామితో,తల్లితండ్రులతో మాట్లాడండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది.

వృశ్చిక రాశి : ఎవరితో కలిసిఉంటున్నారో, వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు తావునిచ్చే ఏవిషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కలిసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది.

ధనస్సు రాశి : నేడు ఈ రాశి వారి జీవితం అందమైన మలుపు తిరగనుంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది.ఈ రోజు ఈరాశి వారు సామాజిక కార్యక్రమాలకు, పార్టీస్‌కు వెళ్లి ఏంజాయ్ చేస్తారు. మీకు సంతోషాన్ని ఇచ్చి పనులు చేయండి. నేడు అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి : ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కుంభ రాశి : అదృష్టం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.

మీన రాశి : విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed