Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 06-08-2024)

by Prasanna |   ( Updated:2024-08-05 21:30:29.0  )
Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 06-08-2024)
X

మేష రాశి

సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలు షేర్ చేసుకుంటారు. ఈ రోజు సాయంత్రం మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరగవచ్చు.

వృషభ రాశి

ఈ రోజు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీని వలన మీరు చిరాకు చాలా పడుతుంటారు. పాత కాలంలో దాచిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో నష్టాలను చూస్తారు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు సమస్యలను సృష్టించవచ్చు. మీ జీవిత భాగస్వామి చెప్పిన పని చేయండి. మీ జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. చిరు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి

ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ ముందు మీకు నచ్చని వ్యక్తులు మాట్లాడినప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి

ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.

సింహ రాశి

మీరు ఆనందించే విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు తరువాత ఇబ్బందుల్లో పడతారు.

కన్యా రాశి

ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.

తులా రాశి

మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, టైం ప్రకారం తింటూ ఉండండి. మీ వ్యాపారం నుండి లాభాలను ఎలా పొందాలో మీ పాత స్నేహితుడు మీకు సలహా ఇస్తారు. వారి సలహాను అనుసరించండి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామికి కోపం తెప్పించే పనులు చేయకండి.

వృశ్చిక రాశి

గర్భవతి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. మీ ఖాళీ సమయాన్ని మీ ఇంట్లో వాళ్ళతో గడపండి. దీని వలన వారు సంతోషంగా ఫీల్ అవుతారు. ఏమి తెలియనట్టు అలాగే ఉండకూడదు. మీరు మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండాలి. సాహసోపేతమైన చర్యలు,నిర్ణయాలు సానుకూల ఫలితాలకు దారితీస్తాయి.

ధనస్సు రాశి

ఈ రోజు ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులన్ని పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టె వారు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయండి. ఈ రాశికి చెందిన వివాహితులు తమ ఖాళీ సమయాన్ని టీవీ కానీ టెలిఫోన్ ముందు గడుపుతారు. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి

ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో పనులు చేయడంలో అలిసిపోతారు.పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. మీ ఖాళీ సమయంలో ఏదైనా పుస్తకం చదవండి. మీ ఇంట్లో వాళ్ల ప్రవర్తన చిరాకు తెప్పించవచ్చు. ఈ రోజు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.

కుంభ రాశి

ఈ రోజు సమయం గురించి తెలుసుకుంటారు. అవసరమైన పనుల కోసమే మీ సమయాన్ని కేటాయించండి. పాత కాలంలో దాచిన డబ్బు మీకు ఏదొక రోజు ఉపయోగపడుతుంది. మీకు ఇష్టమైన వాళ్ళ ప్రవర్తన మీకు కోపం వచ్చేలా వస్తుంది కోప పడకుండా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు సాయంత్రం మీకు, మీ జీవిత భాగస్వామికి గొడవ జరిగే అవకాశం ఉంది.

మీన రాశి

ఈ రోజు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఇన్ని రోజులు ఏమి పోగొట్టుకున్నారో తెలుసుకుంటారు. ఈ రోజు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోకపోతే దొంగిలించబడవచ్చు. మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. మీ వైవాహిక జీవితం గొప్పగా ఉండబోతుంది.

Advertisement

Next Story