Today's Horoscope : నేటి రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-06-14 18:45:44.0  )
Todays Horoscope : నేటి రాశిఫలాలు
X

మేష రాశి : నేడు ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రోజు మొత్తం ఆనందంగా సాగిపోతుంది.

వృషభ రాశి : స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా సాగిపోతాయి.

మిథున రాశి : ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి : నేడు ఈ రాశి వారు విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. రుణ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యు లతో ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చ. ఆరోగ్య పరంగా బాగుంటుంది. ఈ రాశి వారు గనుక గతంలో ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే దాని పర్యవసానాలు నేడు అనుభవిస్తారు. దీని వలన ఈరోజు మీకు డబ్బు చేతికందక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

కన్యా రాశి : నేడు ఈ రాశి వారు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు కలిసి వస్తుంది. ఇక ఈ రోజు మీ వృధా సమయాన్ని పిల్లలతో గడపడానికి కేటాయిస్తారు. ఇష్టమైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాటిని కోల్పోయే అవకాశం ఉంది.

తుల రాశి : ఈ రోజు ఈ రాశి వారి సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు ఇంతమునుపు ఎక్కువఖర్చు పెట్టివుంటే,మీరుఇప్పుడు దానియొక్క పర్యవసానాలను అనుభవిస్తారు.దీనివలన మీకు డబ్బు అవసరమైన మీచేతికి అందదు.

వృశ్చిక రాశి : ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారనేది మీకు చాలా సంతోషాన్నిస్తుంది. ఈ రోజు మొత్తం మీకు చాలా అద్బుతంగా గడుస్తుంది.కుటుంబ సభ్యుల నుంచి లేదా బంధువుల నుంచి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చేప ట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి : వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. బంధువులతో కొద్దిపాటి మాట పట్టింపులుంటాయి. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహ కరంగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మకర రాశి : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఈ సారి మీరు ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. లేనిచో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. మీకు చాలా ఇష్టమైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం లేనిచో, వాటిని కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అన్నింటా శుభఫలితాలే కలుగుతాయి.

కుంభ రాశి : స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి అనుకుంటారు. కానీ మీ ఆలోచనలు ముందుకు సాగవు. కొన్ని కుటుంబ పరమైన సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటి నుంచి మీరు త్వరగా బయటపడుతారు. మీ సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది.

మీన రాశి : వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం

Advertisement

Next Story

Most Viewed