Today's Horoscope : నేటి రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-06-07 18:45:10.0  )
Todays Horoscope : నేటి రాశిఫలాలు
X

మేష రాశి : మీ పెట్టు బుద్దే మీకు ఆశీర్వాదం లాంటిది. ఎన్నో సమస్యల నుంచి అది మిమ్ముల్ని కాపాడుతుంది. ఈరోజు మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అవసరానికి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నేడు కలిసి వస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

వృష రాశి : ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో సఖ్యత అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.

మిథున రాశి : ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు, మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం చాలా మంచిది. మీ పిల్లల అల్లరి చేష్టలు మీకు కాస్త ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. ఆదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి : ఈరోజు మీకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిది. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది.

సింహ రాశి : ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. చిన్న కారు వ్యాపారస్థులు నేడు అత్యాధిక లాభాలు పొందుతారు. ఏదైనా పని చేసే ముందు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం చాలా మంచిది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా చాలా బాగుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయ

కన్యా రాశి : ఒళ్ళునొప్పులు, వత్తిడి కారణంగా కాస్త ఇబ్బంది పడుతారు. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది.

తుల రాశి : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే చాలా రోజులుగా రుణ ప్రయత్నం చేస్తున్నారో వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అవసరానికి మిచి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టీ జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు నేడు చాలా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి : అదృష్టం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి.

ధనస్సు రాశి : ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గృహ నిర్మాణం దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. పరిచయాల ద్వారా కార్య సాఫల్యం ఉంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

మకర రాశి : ఈరోజు ఈరాశి వరకు కలిసి వస్తుంది. మీకు తెలిసిన వారి నుంచి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ కరకు ప్రవర్తన మీ పిల్లలను ఇబ్బంది పెడుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులు కష్టపడితేనే ఫలితం ఉంటుంది.

కుంభ రాశి : ఈరోజు మీరు చాలా యాక్టివ్‌గా పని చేస్తారు. అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. నేడు మీ జీవిత భాగస్వామి మీతో చాలా సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

మీన రాశి : ఖర్చులు అధికంగా అవుతుంటాయి. అందువలన ఖర్చుల అదుపు చేసుకోవడం చాలా మంచిది. మీ బంధువుల రాక వలన మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది.

Advertisement

Next Story