- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేటి రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?
మేష రాశి : నేడు ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతా వరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎవరైతే చాలా కాలంగా మంచి కళశాలలో సీటు కోసం ఎదురు చూస్తున్నారో వారికి కలిసి వస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.
వృషభ రాశి : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
మిథున రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు.
సింహ రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా భూమి లేదా భవనం కొనాలనుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం మీకు తెలిసిన వారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
కన్యా రాశి : తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘమునందు నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చు.అకారణంగా కలహాలు ఏర్పడగలవు.
తుల రాశి : అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడను. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. వృత్తి వ్యాపారాలు మందగమనం గా ఉంటాయి.
వృశ్చిక రాశి : ఈ రాశివారు నేడు అనవసరమైన విషయాల గురించి ఆలోచిచకపోవడం మంచిది. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు ఈరాశి వారు బంధువులు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి : ఈ రోజు మొత్తం మీకు అనుకూలంగా ఉండేలాగ కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇకమీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలనూ తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇంటినుండి బయటకువెళ్లేముందు, అన్ని ముఖ్యమైన కాగితాలను,వస్తువులను సరిచూసుకోవడం మంచిది.
మకర రాశి : చాలా కాలంగా మీరు పడుతున్న సమస్యల నుంచి బయటపడుతారు. ఆదాయం బాగుంటుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి : కొత్త వ్యాపారాలు ప్రారంభించే విషయం ఆలోచిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలు పరిష్కారమైపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
మీన రాశి : వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి అండ దండలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కుటుంబంతో ఆలయాలు సందర్శి స్తారు