- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope : నేటి రాశిఫలాలు.. వీరు జాగ్రత్త
మేష రాశి : ఈ రాశిలో ఉన్న రాజకీయనాయకులకు నేడు కలిసి వస్తుంది. వ్యాపారస్తులు నష్టాలు చూడాల్సి వస్తుంది. ఈ రాశి వారికి నేడు వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి నేడు అన్నింట ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి : ఈరాశి వారికి నేడు బాగుంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చేరోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎవరైతే తన ప్రేమను తన ప్రేయసికి తెలుపుదాం అనుకుటున్నారో, వారికి నేడు శుభ ప్రదంగా ఉంటుంది.
మిథున రాశి : ఈ రాశి వారు నేడు శుభకార్యల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. పాతబకాయిలు వసూలవుతాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా ఎవరైతే విదేశీ ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారో నేడు వారికి కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారు. ఇంట్లో చక్కటి వాతవావరణం ఏర్పడుతుంది.
కర్కాటక రాశి : ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈ రాశి నిరుద్యోగులకు నేడు అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఉద్యోగవకాశాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి.ఈ రాశి వారు నేడు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహ రాశి : ఈరాశువారు స్టాక్ మార్కెట్‌లో మంచి పెట్టుబడులను పెట్టడానికి ప్రయత్నించి సఫలం అవుతారు. విదేశీప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్నకారు వ్యాపారకస్థులకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
కన్యారాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా ధృఢంగా ఉంటారు. ఈరోజు మీ వైవాహిక బంధం చాలా సంతోషంగా సాగిపోతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.
తుల రాశి : నేడు ఈ రాశివారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ సమయానికి బంధువులు, స్నేహితుల సహాయంతో ఆ సమస్య నుంచి బయటపడగలరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి నేడు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, వారికి నేడు కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి : చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. యువత చెడు అలవాట్లకు బానిసై ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
ధనస్సు రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి నేడు కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులు అన్నిరంగాల్లో ముందంజలో ఉంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వైద్యరంగంలో ఉన్నవారికి నేడు కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు నేడు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకర రాశి : ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ఉత్తమం. విద్యార్థులకు కష్టకాలంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులన్నీ నేడు పెండింగ్ పడుతాయి. దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు నేడు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది
కుంభ రాశి : ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి నేడు మంచి అవకాశం దొరకుతుంది. ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
మీన రాశి : ఈ రాశి వారికి నేడు అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఈరోజు వీరు వాగ్వాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. గత కొన్ని రోజుల నుంచి ఎరైతే తమ వర్క్ పెండింగ్‌లో పెడుతారో దాన్ని తమ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.