- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈరోజు రాశిఫలాలు.. ఏ రాశి వారికి నేడు అనుకూలంగా ఉన్నదంటే?
మేష రాశి : ఈ రాశి వారికి నేడు ఆర్థికంగా బాగుంటుంది. అధిక ఖర్చులను నియంత్రించుకోండి. వైవాహిక జీవితం బాగుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది.ఎవరైతే చాలా కాలంగా రుణప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రుణ సదుపాయం దొరికే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్ర్తత అవసరం.
వృషభ రాశి : ఈరోజు అతి విచారం, ఒత్తిడి ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ రాశి వారు ఈరోజు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.
మిథున రాశి : ఈరోజు మీరు చేసే పని మిమ్ముల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త మార్గాల ద్వారా నేడు ధనాన్ని సంపాదిస్తారు. ఈరోజు ఈ రాశి వారు తమస్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు చివర్లో వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతారు. ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్ప వచ్చు.
కర్కాటక రాశి : కొత్త ఒప్పందాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మొత్తం స్నేహితులతో గడపడానికే ఆసక్తి చూపుతారు. ఆఫీసుల్లో పని చేసే వారు సీనియర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయినా నేడు మీకు అద్భుతంగా గడుస్తుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. మీ సంతానం ద్వారా మీరు మంచి గౌరవ మర్యాదాలు పొందుతారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.
సింహ రాశి : ఈరోజు ఈరాశి వారు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అతిగా ఖర్చు పెట్టడం వలన కాస్త మానసిక ఆందోళనకు గురి అవుతారు. కానీ సాయంత్రం వేళల్లో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారం చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామి మిమ్ముల్ని సంతోషపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.
కన్యా రాశి : ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈరోజు ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయిస్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు నేడు అత్యధిక లాభాలు పొందుతారు.
తులరాశి :ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉం టాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
వృశ్చిక రాశి : ఈరోజు ఈ రాశి వారికి డబ్బు విలువ బాగా తెలిసి వస్తుంది. మీరు నేడు ధనాన్ని ఎంత దాచి పెడితే కష్టసమయంలో అంత ఉపయోగపడుతుందని తెలుసుకుంటారు. దీంతో ఈరోజు డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఇక ఈరాశి వారికి నేడు అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి పని వీరికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి : ఈరోజు ఈరాశి వారు ఎక్కువగా బయట కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఒత్తిడి, అలసటకు లోనవుతారు. డబ్బుమీకు ముఖ్యమైనప్పటికీ,మీరు దానిపట్ల సున్నితమగా వ్యవహరించి సంబంధాలను పాడుచేసుకోవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశిలోని వ్యాపారస్తులు ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు వీరు వీరి కుటుంబ సభ్యులతో విందు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
మకర రాశి : అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
కుంభ రాశి : ఈరోజు మీరు అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. మీ కుటుంబసభ్యులతో ఏదైనా ముఖ్యమైన విషయాలు చర్చించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఈ రోజు మీరు ఆఫీసులో అతిగా పనిచేయడం కాస్త ఇబ్బందికరంగా అనిపించినా మీకు అది భవిష్యత్తులో మంచి పేరును తీసుకొస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
మీన రాశి :ఈరోజు మీరు డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. అనవసరమైన తగవులకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి: