నేటి రాశిఫలాలు.. హోలీ ఈ రాశి వారి జీవితంలో అద్భుతాన్ని తెస్తుంది

by samatah |   ( Updated:2023-03-07 02:07:17.0  )
నేటి రాశిఫలాలు..  హోలీ ఈ రాశి వారి జీవితంలో అద్భుతాన్ని తెస్తుంది
X

మేష రాశి : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక శాంతిని పొందుతారు. రేపు మఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి : హోలీ రోజు ఈ రాశి వారు శుభవార్తను అందుకుంటారు. వైవాహిక జీవితం చాలా సంతోంగా ఉంటుంది. మీ బంధువులు, స్నేహితులతో పండుగను చాలా సరదాగా జరుపుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశం వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు నష్టం తప్పదు. ముఖ్యమైన పనులు నెరవేరుతాయి.

మిథున రాశి : ఈ రాశివారు నేడు ఆఫీసులో శుభవార్త అందుకుంటారు. మీరు ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేస్తారు వారికి ఎలాంటి పరిస్థితులలోనైనా తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు రావడం వలన వారి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి : ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి, ప్రశాంతతను కలిగిస్తాడు. మీరు డబ్బుని ఇతరదేశాలలోని స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. చాలా కాలంగా ఎవరైతే రుణాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి రుణ సదుపాయం అందే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది.

సింహ రాశి : ఈరోజు మీకు ఏది ఇష్టమో ఆపనిని పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరంగా జరిగినప్పటికీ మీరు ఈరోజు చివర్లో మాత్రమే కావాల్సినంత ధనాన్ని పొదుపు చేస్తారు. రోజు మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. స్నేహితులతో ఏంజాయ్ చేస్తారు.విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కాగలదు. రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుంది.

కన్యా రాశి :తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. అదృష్టం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.ముఖ్యమైన పనులన్నీ కంప్లీట్ అవుతాయి.

తుల రాశి : ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. పై చదువులకు ఈ వారం అనుకూలం. ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహిస్తారు. నియమాలకు లోబడి పనులు చేస్తారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి : ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా, మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.దీంతో ధనాన్ని పొదుపు చేస్తారు. ఈరోజు సాయంత్రం చాలా సరదాగా గడుపుతారు. ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. మీజీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ఆర్థికపరిస్థి మెరుగు పడుతుంది. డబ్బు సమస్యలన్నీ దూరమవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఓ వ్యక్తి ఈరోజు మీ వైవాహిక బంధంలో సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి.

మకర రాశి : ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. పూర్వం మీ భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మనస్పూర్తిగా మాట్లాడటానికి మచి సమయం. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.

కుంభ రాశి : ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. తోబుట్టువుల సహాయసహాకారాలు అందుతాయి. ఈరోజు మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది.ఆఫీసులో చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మీన రాశి : మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీయొక్క ఆర్ధికపరిస్థితి దృఢంగా ఉంటుంది.అయినప్పటికీ మీరు మీఅతిఖర్చులు లేక అనవసరఖర్చులపై శ్రద్ద కలిగిఉండాలి. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజు గా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు.ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Also Read..

Telugu Panchangam 07 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!

Advertisement

Next Story