Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు

by Disha Tech |
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు
X

మేష రాశి : చిన్నవిషయాలకు ఆందోళన పడకండి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దాని వల్ల మీరు తర్వాత బాధ పడాలిసి ఉంటుంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి : ఈ రోజు మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. కానీ ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ ఖాళీ సమయాన్ని మీ ఇంట్లో వారితో గడపండి. దీని వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది ఆఫీసులో మీరు చేసే పనికి మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు ఇవి మంచి రోజులు. మీ వైవాహిక జీవితం మారబోతుంది.

మిథున రాశి : దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. మీరు చేసే పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చిన మీ ధైర్యంతో ముందుకు అడుగు వేయండి. ఈ రోజు మీ జీవితంలో ముఖ్య మైన రోజు . మీరు అప్పు ఇచ్చి ఉంటె అది ఈ రోజు మీ దగ్గరికి చేరుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో గొడవ పడుతుంది.

కర్కాటక రాశి : ఈ రోజు నూనెతో చేసిన వంటకాలను తినకండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. అలాగే మసాలా వంటకాలను మానండి. విద్యార్థులకు మంచిగా కలిసి వస్తుంది. అనుకోని అతిథి వల్ల మీరు చెయ్యాలనుకున్న పనులు అన్ని ఆగిపోతాయి. మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. మీ జీవిత భాగస్వామిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.

సింహ రాశి : మీకుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీకు చిరాకు వస్తుంది. కానీ మీరు ప్రశాంతంగా ఉండండి. ఆర్ధిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారికీ మీ ప్రేమను పంచండి. ఈ రోజు మీరు కొన్ని అశుభవార్తలు వినాలిసి ఉంటుంది. . ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కన్యా రాశి : ఈ రోజు మీరు కొత్త వారిని కలుసుకుంటారు. వారితో ముఖ్య మైన విషయాల గురించి చర్చిస్తారు. వారి వల్ల మీ జీవితం కూడా మారిపోవచ్చు. మీ స్నేహితులు అవసరాన్ని మీరు తీర్చగలరు. ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి. పని విషయంలో మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. సమయం విలువ ఈ రోజు తెలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడనున్నాయి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి అనేక ప్రయోగాలు చేస్తుంది.

తులా రాశి : మీ పాత స్నేహితులను కలుసుకొని వారి నుంచి కొంత డబ్బునుఅప్పుగా తీసుకుంటారు. ఎప్పుడు పని గురించే ఆలోచించకుండా మీ కొరకు మీరు కొంత సమయాన్ని కేటాయించడం నేర్చుకోండి. ఈ రోజు అనుకోని అతిధులు మీ ఇంటికి వస్తారు. అలా రావడం వల్ల మీ పనులు ఆగిపోతాయి. మీ లాంటి వారు మీకు దొరకాలంటే చాలా కష్టం . కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఆర్ధిక పరిస్థితులు ఎక్కువుతాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చెప్పినట్టు వినండి.

వృశ్చిక రాశి : ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఏ పని చేసిన మీ ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి. మీరు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. అలాగే మీ ఇంటిలో పెళ్ళికి సంబందించిన చర్చలు జరుగుతాయి. మీ జీవితలో మీరు అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఒక్క క్షణం మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మీరు మీ జీవితంలో గెలిచినట్లే. మీ ఆరోగ్య బాధలు పోతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవిత భాగస్వామి మీ మీద అలుగుతుంది.

ధనస్సు రాశి : మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయండి. మీరు చేసే పని మీకు తెలిస్తే చాలు మీరు ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాలిసిన అవసరం లేదు. ఇతరుల మీ గురించి ఏమన్నా కూడా ఆ విషయాలను పట్టించుకోకండి. మీకు మనస్సుకు ఎలా నచ్చితే అలా చేయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తుంటదని మర్చిపోకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.

మకర రాశి : మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. కాబట్టి ఎక్కడికి వెళ్ళకండి. కొన్ని సమస్యల వల్ల మీరు ప్రశాంతతను కోల్పోతారు. ఈ రోజు మీ సమయం టీవీచూడటం , సినిమాచూడటం ద్వారా గడిచిపోతుంది. దీనివలన మీరు మీయొక్క ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ముందు మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది. ఆర్ధిక సమస్యలు ఎక్కువుతాయి. మీ వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది.

కుంభ రాశి : ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఎంత వరకు మీ మాటే మీదే పోకుండా.. ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినండి. అది మంచి పద్ధతి. కానీ ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు.కొన్ని ఎలా జరిగితే అది అంగీకరిస్తూ ముందుకు వెళ్లాలి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ రోజు ఆఫీసులో మీరు చేసే పనికి మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలే లాభాలు. మీ వైవాహిక జీవితం మారబోతుంది.

మీన రాశి : ఈ రోజు మీరు అనుకున్న కల నెరవేరబోతోంది. మీరు మీ లక్ష్యాలవైపుగా నడవండి. ఈ రాశికి చెందిన వారు ఒకరి మీద ఆధార పడి బ్రతకడం మానండి. మీ లవర్ ఈ రోజు మీతో గొడవ పడవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ మనస్సు మీ ఆధీనంలో ఉంచుకోండి.మీరు ఈ రోజు మీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి.. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.


Advertisement

Next Story