Lord Ganesh: వినాయకుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

by Prasanna |
Lord Ganesh: వినాయకుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభ కార్యం జరిగినా ముందు వినాయకుడిని ( Lord Ganesh ) పూజిస్తాం. ఈ దేవుడిని పూజించిన తర్వాతే ఇతర దేవుళ్లను పూజిస్తారు. అయితే, వినాయకుడికి ఇష్టమైన రాశులున్నాయని మనలో చాలా మందికి తెలియదు. శివపార్వతుల చిన్న కొడుకు వినాయకుడు. ఆయన వాహనం ఎలుక. కొందరు ఎలుకలను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. బొజ్జ గణపయ్యకి మోదకాలు అంటే చాలా ఇష్టం. అందుకే, వినాయక చవితి రోజు వీటిని తయారు చేసి గణపతి వద్ద పెడతారు. ఎలుకలను ఎంత బాగా ఇష్ట పడతాడో కొన్ని రాశులను కూడా అంతే ఇష్ట పడతాడు. అయితే, వినాయకుడికి ఇష్టమైన రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

మకర రాశి ( Makara rashi )

మకర రాశి వారంటే వినాయకుడికి చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు. వీరిపై గణపతి అనుగ్రహం ఉంటుంది. వీళ్లు మనసులో ఏం కోరుకున్నా నెరవేరుతాయి. అలాగే, జీవితంలో కూడా సెటిల్ అవుతారు. ఎలాంటి కష్టాలు వచ్చినా.. ముందుకు వెళ్తారు. అలాగే, వీరి కుంటుంబంలో సంతోషం ఉంటుంది. మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆ దేవుడి అనుగ్రహం వలన వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి. సమాజంలో గౌరవం పొందుతారు. తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

మేష రాశి ( Mesha rashi )

రాశులలో మొదటి రాశి మేష రాశి. ఈ రాశి వారిపై గణపతి దేవుడి కృప ఉంటుంది. జీవితంలో వీళ్లు అన్ని సౌకర్యాలు పొందుతారు. అలాగే, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఏ కష్టాలు వచ్చినా వారిని వినాయకుడు కాపాడుతాడు. ఈ రాశి వారు లైఫ్ లో లగ్జరీని లీడ్‌ చేస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story