శోభకృత్ నామ సంవత్సరం : వృశ్చిక రాశివారికి ఉద్యోగంలో పనిభారం..ఆర్థిక సమస్యలు తప్పవు

by samatah |   ( Updated:2023-03-21 15:16:05.0  )
శోభకృత్ నామ సంవత్సరం : వృశ్చిక రాశివారికి ఉద్యోగంలో పనిభారం..ఆర్థిక సమస్యలు తప్పవు
X

వృశ్చిక రాశి

సార గోచారము: వృక్తిక మాసములో పుట్టిన వారికి

చాంద్ర గోచారము : విశాఖ 4: అమారాధ, జ్యేష్ఠ

నామ నక్షత్రము : తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు

ఆదాయ వ్యయాలు

ఆదాయం 5

వ్యయం 5

రాజపూజ్యం 3

అవమానం 3

గురువు : ఏప్రిల్ 21 వరకు గిన, తామ్రమూర్తి ఊహించని మానసిక చికాకులు ఎక్కువగును. తదాది వత్సవపర్యస్తం 6న సువర్ణమూర్తి, లాభం, సంతోషం, సౌఖ్యము వృద్ధి చెందును.

శని : వత్సరపర్యస్తం 4న సువర్ణమూర్తి అయినవారి సహాయ సహకారములు బాగా లభించును.

రాహువు : అక్టోబర్ 30 వరకు 6న తామ్రమూర్తి. అభివృద్ధి తక్కువగానుండును. తదాది వత్సరపర్యస్తం5న తామ్రమూర్తి. ఊహించని మానసిక చికాకులు ఎక్కువగును.

కేతువు : అక్టోబర్ 30 వరకు 12 తామ్రమూర్తి. ఖర్చులు బాగా పెరుగును, తదాది వత్సరపర్యస్తం 11న తామ్రమూర్తి కొద్దిపాటి నష్టంతో లాభము కలగచేయును.

ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శనీశ్వరుడు నాలుగవ రాశిలోనూ, గురు రాహువులు ఆరవ రాశిలోనూ, కేతువు వ్యయంలోనూ సంచరిం చడం జరుగుతోంది. దీని ఫలితంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించడం ఖాయం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను తరచూ వాయిదా వేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఉద్యోగం, ఇల్లు మారడం జరుగుతుంది. సహనంతోను, సామరస్యంతోను, సంయమనం తోనూ వ్యవహరించాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లుల కొత్త ఆలోచనలకు, కొత్త పథకాలకు అనుకూలం. దానధర్మాలు, వైదిక వసూళ్ళు ఆలస్యమగు సూచనలు కలవు. ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రయాణములకు అవకాశములు కలుగును. కోర్టు వ్యాపారములు, పెద్దలతో అంతరంగిక చర్చలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. వ్యవహారములు అనుకూలముగా ఉండును. వైశ్యానిక, ఆధ్యాత్మిక చర్చలలో చేపట్టిన పనులు ముగింపు దశకు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సమర్థతతో నిర్వహిస్తారు.

వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ప్రతి పనీ ఆలస్యం కావడం, అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఉద్యోగంలో స్థాన చలనం, సోదరులతో విబేధాలు, ఇరుగు పొరుగుతో సమస్యలు, భార్యకు అనారోగ్యం వంటివి చోటు చేసుకుంటాయి. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే, చిన్న చిన్న సమస్యలను పక్కన పెడితే ఏడాదంతా దాదాపు ప్రశాంతంగా గడిచిపోతుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి, కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి చాలా బాగుంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థలు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ట అప్రమత్తంగాఉండండి. ఖర్చులు ఎక్కువగా చేసే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో విందు, వినోదాలు, వివాహాది శుభకార్యములు స్థిర పడతాయి. కుటుంబ వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి విద్యావంతులతో పరిచయాలు ఏర్పడుతాయి. వైజ్ఞానిక సమావేశాలలో పాల్గొనటం, ఆర్థికంగా ఉండును. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో మార్పులకు, చేర్పులకు ఇది కలసి రావటం, దైవభక్తి కలుగును. ఆకస్మిక ప్రయోజనాలను ఆశించి పొరపాట్లకు తగిన సమయం. సంతానమునకు అభివృద్ధి కలుగును.

ఇవి కూడా చదవండి:

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story