- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 పంచాంగం: 11వ స్థానంలో కేతు సంచారం.. ధనస్సు రాశి వారి ఏడాదంతా శుభ ఫలితాలే
ధనస్సు రాశి
సార గోచారము: ధనుర్మాసములో పుట్టిన వారికి
చంద్ర గోచారము: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1
నామ నక్షత్రము : యే. యో. భా. బి. భూ.టీ.స.ర. భ
ఆదాయ వ్యయాలు
ఆదాయం 8
వ్యయం 11
రాజపూజ్యం 6
అవమానం 3
గురువు : ఏప్రిల్ 22 వరకు 45 రజతమూర్తి. శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ తదాది వత్సరపర్యన్తం 5న రజతమూర్తి. మానసిక కష్టములు, అనవసర చికాకులు తరచు కలుగును.
శని : వత్సరపర్యన్తం 3న లోహమూర్తి. అందరితో అనవసరమైన చికాకులు ఏర్పడును.
రాహువు : అక్టోబరు 30 వరకు 5న రజతమూర్తి .మానసిక కష్టములు, అనవసర చికాకులు తరచు కలుగును. తదాది వత్సరపర్యన్తం 4న సువర్ణమూర్తి, అయినవారి సహాయ సహకారములు బాగా లభించును.
కేతువు : అక్టోబరు 30 వరకు 11న రజతమూర్తి అంతటా సర్వ సౌఖ్యములు చేకూరును. తదాది వత్సరపర్యన్తం 10న సువర్ణమూర్తి అన్ని రంగములలోను అడ్డంకులు తొలగి జయము కలుగును.
మూడవ స్థానంలో శని, ఐదవ స్థానంలో గురు రాహువులు, 11వ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి జీవితమంతా శుభమయంగా ఉంటుంది. శుభవార్తలు, శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. సమాజంలో మాటకు విలువ ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది.మీ సమర్థతలకు గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు, లాయర్లకు పదోన్నతి, గౌరవము కలుగును, పాత బకాయిలు వసూళ్ళు అవుతాయి. నూతన ప్రయాణములకు అవకాశాలు కలుగును, శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం. గుర్తింపు లభిస్తాయి. కోర్టు వ్యవహారములు అనుకూలముగా ఉండును. మాసాంతంలో విశ్రాంతి లోపం, పరిమితులు తప్పిన ఆహార పానీయాల చికాకు కల్గించును. కళాశాల వ్యవహారాలు, పత్రికా వ్యాసాలు మీలో చురుకుదనాన్ని వల్ల ఆరోగ్య ఇబ్బందులు పెడుతుంది. స్పెక్యులేషన్ చేసేవారు ఆందోళనకు కలిగిస్తాయి. వ్యవహారిక శైలిలో దాపరికం అవసరం. వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందుకు సాగవలెను. ఆర్థిక నష్టము రాకుండా ఉండుటకై జాగ్రత్త వహించవలెను. మానసిక ఆందోళన, అయిన వారితో పేచీల వలన చికాకు పొందుతారు.
కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అదాయంపెరుగుదల, వ్యాపారాభివృద్ది, ప్రమోషన్ను, కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణం, శుభకార్యాలకు ఆస్కారముంది. ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జాయింట్ వ్యవహారాలలో బయట వారి సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. మధ్య మధ్య అనవసరపు ఆందోళనలకు గురవుతారు. పిల్లల వివాహ వృత్తి విషయాలలో బంధువుల సహకారాలు బాగుంటాయి.
మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటు ము౦దుకు సాగుతారు. కొన్ని ప్రయత్నాలు తేలికగా సానుకూలపడతాయి. మీ తల్లితండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకు అంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెడతారు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
ఇవి కూడా చదవండి:
శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి