May 23: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి జాతకం మారిపోతుంది!

by Prasanna |   ( Updated:2023-05-22 20:30:36.0  )
May 23: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి జాతకం మారిపోతుంది!
X

మేష రాశి : ఈ రోజు మంచిగా రిలాక్స్ అవుదామనుకుంటారు. మీ పాత స్నేహితులను కలుసుకొని వారితో కొంత సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ ఖాళి సమయాన్ని పెండింగ్ పనులకు కేటాయిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్తారు. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి.మీరు ఈ రోజు మీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి.. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడనున్నాయి. మీ యొక్క ఆరోగ్యం బాగ లేకపోవడం వలన మీరు చేయాలనుకున్న పనులు పెండింగ్ పడతాయి. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. మీ వైవాహిక జీవితం అందంగా మారబోతుంది. డబ్బు ఉంది కదా అని ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టకండి . మీ కోసం మీరు సమయాన్ని కేటాయించండి. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. కొన్ని సార్లు జరిగిన దాన్ని అంగీకరించి.. ముందుకు వెళ్లడమే.. ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు.ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి: మీరు ఇంతక ముందు ఎక్కువఖర్చు పెట్టివుంటే.. మీరు ఇప్పుడు దానియొక్క పర్యవసానాలను అనుభవిస్తారు.దీనివలన మీకు డబ్బు అవసరమైన మీచేతికి అందదు. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళి చిన్న ట్రిప్.. మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది.

కర్కాటక రాశి: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈరోజు మీకు విశ్రాంతి చాలా ముఖ్యం. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు.ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు.

సింహ రాశి : మీ ఆరోగ్య సమస్యల వల్ల మీరు చేయాలనుకున్న పనులను చెయ్యలేరు. మీ ఇంటికి అతిదులు రావడం వలన మీ పనులను వాయిదా పడతాయి. .రోజుమొత్తము మీరు దీనివలన విచారానికి గురిఅవుతారు. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది.

కన్యా రాశి: ఈ రోజు మీకు విశ్రాంతి తీసుకుంటారు. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. ఒక సాయంత్రం వేళ, ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి, అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈరోజు సాయంత్రము ఖాళి సమయములో మీరు మీమనస్సుకి బాగాదగ్గరైనవారి ఇంట్లో గడుపుతారు. కానీ,ఈసమయములో వారు చెప్పేవిషయానికి మీరు భాదను పొందుతారు.

తులా రాశి: అతిగా ఖర్చులు పెట్టకండి. మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు అది గుర్తు పెట్టుకోండి. మీరు, మీ సమయాన్ని మీ ఇంట్లో వారికీ కేటాయించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక స్పెషల్ చేస్తారు. మీ యొక్క పనులు పూర్తికాకూండా మీరు కొత్త పనుల గురించి ఆలోచించకండి . ఇది మీరు పాటించకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి: ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాదనుకున్న డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో మంచి ఆఫర్ వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రోజు మీరు అనుకున్న కల నెరవేరబోతోంది.మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సమస్యల గురించి చర్చిస్తారు. మీ పని చేసిన దానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవితం భాగస్వామితో మీ బాధలను పంచుకుంటారు. మీ వైవాహిక జీవితం అందంగా మారబోతుంది.

మకర రాశి: మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా దాచుకోవాలి. మీ వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి : ఈ రోజు ఆఫీసు నుంచి త్వరగావెళ్లడానికి ప్రయత్నించండి. మీ మనస్సు సంతోషంగా ఉండే పనులు చెయ్యండి. ఈ రోజు .. మీరు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఉంటారో వారి దగ్గరే మళ్లీ అప్పుగా కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మీన రాశి: మీరు కన్న కలలు నిజమౌతాయి. డబ్బు ఉందని పొగరుగా ఉండకండి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.నేడు మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. ఈ రోజు మీరు కొన్ని పనులు వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు . ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కోపాన్ని తెప్పిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed