Malavya Rajyoga: మాలవ్య రాజయోగం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు

by Prasanna |
Malavya Rajyoga: మాలవ్య రాజయోగం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు
X

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. దీని వలన మనుషుల జీవితాల్లో కొత్త మార్పులు వస్తాయి. ఇదిలా ఉండగా.. శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు . ఈ కారణంగా మాళవ్య రాజ్యయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం వలన కొన్ని రాశుల వారికి శుభంగాను, మరి కొన్ని రాశుల వారికి అశుభంగాను ఉంటుంది. ఏయే ఏయే రాశుల వారికీ మంచిగా ఉండనుందో ఇక్కడ తెలుసుకుందాం..

మేష రాశి

మాలవ్య రాజయోగం వలన ఈ రాశి వారికీ శుభంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. అలాగే, మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది. మీరు చేసే ప్రతీ పనిలో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. మీ వ్యాపారాల వలన సంపాదన భారీగా పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే కల నెరవేరుతుంది.

మకర రాశి

మాలవ్య రాజ్యయోగం మకర రాశివారి జీవితం మొత్తం మారిపోతుంది. అంతేకాకుండా మీ కెరీర్‌కి సంబంధించిన అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ఆఫీసులో పనిచేసే వారికి జీతంతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఈ సమయంలో కారు కానీ భూమి కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story