Horoscope: గురుడు సంచారం ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

by Prasanna |   ( Updated:2024-07-18 10:41:30.0  )
Horoscope: గురుడు సంచారం ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం
X

దిశ, ఫీచర్స్: గురుడు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడింది. ఆర్థిక సమస్యలు తొలగి సంపద పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గురువు, రోహిణి నక్షత్రం లోకి సంచారం చేయనున్నాడు. ఇదే నక్షత్రం లో ఆగస్టు 20 వరకు ఉండనున్నాడు. ఈ కారణంగా రెండు రాశులకు మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేష రాశి

దేవ గురువు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు మొదలు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ సమయంలో మీ దగ్గరకి చేరుతుంది. కారు లేదా భవనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి

గురుడు రాశి మారడం వలన కర్కాటక రాశి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం వస్తుంది. మీరు ఏది అయితే కోరుకుంటారో అది నెరవేరుతుంది. పెళ్లి కానీ వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి సంతానం కలిగే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story