ఫిబ్రవరి 29న పుట్టారా.. మీ జీవితంలో ఈ ఇయర్ అద్భుతం జరగబోతుందని తెలుసా?

by Jakkula Samataha |
ఫిబ్రవరి 29న పుట్టారా.. మీ జీవితంలో ఈ ఇయర్ అద్భుతం జరగబోతుందని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : పుట్టిన రోజు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా మంది బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంటారు. కొంత మందికి మాత్రమే బర్త్ డే వేడుకలకు కాస్త దూరంగా ఉంటారు. అయితే ఎవరైనా సంవత్సరానికి ఒకసారి పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారు. కానీ లీప్ సంవత్సరంలో పుట్టిన వారు మాత్రం, నాలుగు సంవత్సరాలకు ఒకసారి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు.

అయితే (2024) ఇది లీప్ సంత్సరం. దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ లీప్ ఇయర్‌‌కు జ్యోతిష్య శాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందంట. ముఖ్యంగా ఈ రోజు జన్మించిన వ్యక్తులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది అంటున్నారు పండితులు. ఫిబ్రవరి 29 కుంభరాశిలో అద్భుతమైన కలయిక జరగబోతుంది. ఈరోజు జన్మించిన వారి జన్మ చార్ట్ లో శని స్థానం బలంగా ఉన్నవాళ్లు పంచ మహా పురుష రాజయోగాన్ని అనుభవిస్తారు. ఇది శుభ, శక్తివంతమైన గ్రహ కలయికలను సూచిస్తుంది. అలాగే వృషభం, సింహం, వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు శశ రాజయోగం ఉండగా, మేషం, కర్కాటక, మకర, తుల రాశుల వారికి రుచక యోగం ఏర్పడనుందంట. అందువలన ఈ లీప్ సంవత్సరంలో పుట్టిన వారికి, ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నవారికి అదృష్టం పడుతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed