Rakhi: రాఖీ పండుగ నుంచి ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

by Prasanna |
Rakhi: రాఖీ పండుగ నుంచి ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్ : రాఖీ పండుగను శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున అందరూ జరుపుకుంటారు. ఈరోజున అన్నదమ్ములు సంతోషంగా ఉండాలని అక్క చెల్లెల్లు చేతికి అన్న లేదా తమ్ముడికి రాఖీ కడతారు. ఈ పండగకు మన దేశంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ ఏడాదిలో రాబోతున్న రాఖీ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున యోగాలు ఏర్పడనున్నాయి . దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపైన పడనుంది. వారిలో రెండు రాశులు ఆర్ధికంగా లాభ పడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటోఇక్కడ చూద్దాం..

ధనస్సు రాశి

రాఖీ పండుగ నుంచి ధనస్సు రాశి వారికి శుభంగా ఉండనుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ లాభాలు పెరుగుతాయి. సంపాదన కూడా రెండింతలు పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగం కోసం చూసే వారికీ కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం వస్తుంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రాఖీ పండుగ నుంచి మంచి రోజులు రానున్నాయి. ముఖ్యంగా, పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లిట్ చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలను పొందుతారు. మీరు పని చేసే ఆఫీసులో జీతంతో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story