శ్రీరామనవమి పండుగ రోజు నుంచి.. ఈ 5 రాశుల వారికి దశ తిరిగినట్టే.. మీ రాశి ఉందా?

by Prasanna |
శ్రీరామనవమి పండుగ రోజు నుంచి.. ఈ 5 రాశుల వారికి దశ తిరిగినట్టే.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్ : ఈ ఏడాది శ్రీరామ నవమి చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామ నవమి అభిజిత్ ముహూర్తం నాడు అరుదైన యాదృచ్చికం జరగనుంది. ఇదే రోజున గజకేసరి యోగం కూడా ఏర్పడనుంది. ముఖ్యంగా, శ్రీరామ నవమి రోజున ఈ రాశుల వారికి దశ తిరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

తులా రాశి

తులా రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు మీ దగ్గరికి చేరుతుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మీకు లబ్ధిని కలిగిస్తుంది. మీ కెరీర్ ను మెరుగుపరుచుకోవడానికి కూడా గొప్ప అవకాశాలు రానున్నాయి.

మేష రాశి

శ్రీరామనవమి మేష రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సమస్యలను అధిగమిస్తారు. ఊహించని విధంగా వీరి దగ్గరికి పూర్వీకుల ఆస్తి వస్తుంది. ఆర్ధికంగా లాభ పడనున్నారు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కారమవుతాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారిపై రాముడి దయ ఎల్లవేళలా ఉంటుంది.

మకర రాశి

ఈ రాశి వారికి శ్రీరామ నవమిని నుంచి కలిసి రానుంది. కెరీర్ పురోగతికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ఉన్నతమైన మర్యాదలు పొందుతారు.ధార్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తివవుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి శ్రీరామ నవమి శుభఫలితాలను అందిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఉల్లాసమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కాలంలో డబ్బు పెట్టుబడి పెడితే అది పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యంగా, సమస్యలు లేకుండా జీవించే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి

శ్రీరామ నవమి రోజున కర్కాటక రాశి వారికి శుభం కలుగుతుంది. భవిష్యత్తులో ఆర్థిక లాభాలను సాధించడంలో మీకు సహాయపడే మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, మీరు ప్రయోజనం పొందేందుకు అనేక అవకాశాలను కనుగొంటారు.

Advertisement

Next Story

Most Viewed