Chaturgrahi Yogam: చతుర్గ్రాహి యోగం.. ఆ రాశుల వారికి కొన్ని విషయాల్లో నష్టాలు

by Prasanna |
Chaturgrahi Yogam: చతుర్గ్రాహి యోగం.. ఆ రాశుల వారికి కొన్ని విషయాల్లో నష్టాలు
X

దిశ , వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు యోగం ఏర్పడుతుంది. ఇది శక్తివంతమైనది. అసలు ఈ యోగం ఎలా ఏర్పడుతుందంటే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి అశుభంగా ఉండనుంది. దీని వలన ఏయే రాశుల వారు నష్ట పోనున్నారో ఇక్కడ చూద్దాం..

తులా రాశి: ఈ యోగం వలన తులా రాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇంట్లో వారి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి , బయట ఖర్చులు తగ్గించుకోండి. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికీ ప్రతికూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.

కుంభ రాశి: కుంభ రాశి వారికి ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులకు మాట ఇచ్చే ముందు ఒకటికీ రెండు సార్లు ఆలోచించుకోండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story