Budhaditya Yoga : బుధాదిత్య రాజ యోగం.. ఆ రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్..

by Prasanna |
Budhaditya Yoga : బుధాదిత్య రాజ యోగం.. ఆ  రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్..
X

దిశ , వెబ్ డెస్క్ : జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తాయి. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు బుధాదిత్య రాజ యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక వల్ల అన్ని రాశులవారిపై ప్రభావం చూపుతుంది. అయితే, ఈ యోగం వలన ఆ రాశుల వారికీ బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ధనుస్సు రాశి: మీరు పని చేస్తున్న ఆఫీసులో విబేధాలు వస్తాయి. అంతే కాకుండా, ఆర్ధికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మీరు ఇతరులతో మాట్లడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి.

మకర రాశి: ఈ రాశివారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అనవరసమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. మీ జీవిత భాగాస్వామితో మీతో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఉంది. మీ కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed