- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 శోభకృత్ నామ సంవత్సరం : ఈ రాశి స్త్రీలు ఈ ఏడాది అన్నిట్లో రాణిస్తారు
కుంభ రాశి
సౌర గోచారము: కుంభ మాసములో పుట్టిన వారికి
చంద్రగోచారము : ధన 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1.2.3.
నామ నక్షత్రము: గూ, గె, గో, సా, సీ, సు, సే, సో, దా
ఆదాయ వ్యయాలు
ఆదాయం 11,
వ్యయం 5,
రాజపూజ్యం 5,
అవమానం 6
గురువు : ఏప్రిల్ 22 వరకు 2న తామ్రమూర్తి మాట విలువ తగ్గును. ఆర్థిక పురోగతి తగ్గును. తదాది వత్సరపర్యన్తం 3 తామ్రమూర్తి, కార్యసిద్ధిని, అనారోగ్యమును కలుగ చేయును.
శని : వత్సరపర్యస్త్రం 1న తామ్రమూర్తి, తరచు పలుకుబడికి నష్టము కలుగును.
రాహువు: అక్టోబరు 30 వరకు 3న తామ్రమూర్తి, కార్యసిద్ధిని, అనారోగ్యమును కలుగ చేయును. తదాది వత్సరపర్యన్తం 2న లోహమూర్తి. శ్రమకు తగిన సుఖము కలుగును. సమయమునకు తగిన ధనప్రాప్తి కలుగును. పేతువు అక్టోబరు 30 వరకు 9న తామ్రమూర్తి. అందరి సహాయ, సహకారాలు లభిస్తాయి.
కేతువు : అక్టోబరు 30 వరకు 9న తామ్రమూర్తి. అందరి సహాయ, సహకారాలు లభిస్తాయి. తదాది వత్సరపర్యన్తం 8న లోహమూర్తి. విఘ్నములెక్కువ. ఆరోగ్యము తక్కువ.
మొదటి రాశిలో శనీశ్వరుడు, మూడవ రాశిలో గురు రాహువులు, భాగ్య స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు, పని భారం పెరుగుతాయి. ఇతరుల జోక్యం వల్ల పాతసమస్యలు కొలిక్కి వస్తాయి. మీ తెలివితేటలకు, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కలిసివస్తుంది. కానీ సంతృప్తి ఉండదు. మీ శ్రమకు తగిన ప్రతిఫలము దక్కుట కష్టము. ఆర్థికంగా ఇబ్బందులేమీ ఉండవు. ఆరోగ్యం విషయంలో మెలకువ వహించండి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్య మధ్య భాగస్వాములతో కలహము,ఉద్యోగాన్ని మార్చుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయటం మంచిది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. విక్రాంతికి చేసే ప్రయత్నాలు అనుకూలించవు. కుటుంబ సభ్యుల ధోరణి ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి సంతృప్తి ఉండదు. స్త్రీలకు గుర్తింపు, రాణింపు ఉంటాయి. కూరలు, పండ్ల వ్యాపారులకు శుభదాయకం. పనులలో చికాకు పెరుగుతుంది. రత్నాలు, బంగారం, వెండి, వస్త్రాలు వ్యాపారులకు శత్రుబాధ పెరుగుతుంది. కోపమును తగ్గించుకోవాలి.అకస్మికమైన వింత మార్పు జరిగే సూచనలున్నాయి.లాభానికి ఇల్లు గానీ, స్ధలం గానీ అమ్ముకోవాల్సి రావడం, వైద్య ఖర్చులు తగ్గడం, ప్రతి పనీ తేలికగా పూర్తి కాకపోవడం, అనవసర ఖర్చులు తగ్గి పొదుపు చర్యలు చేపట్టడం, బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉండడం, ఉద్యోగ౦ మారడం వంటి ఫలితాలు అనుభవానికి వస్తాయి. జాతక చక్రంలో గ్రహాలు, దశలు బాగా ఉన్న పక్ష౦లో పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. సంతానమునకు స్వల్పముగా ఆరోగ్యభంగములు, విరోధము ఏర్పడును. రైతులకు వాతావరణం అనుకూలించక చికాకుగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడినచో విజయమును సాధించగలరు. మాసాంతములో అనుకూలంగా ఉన్నది. ప్రయత్న పూర్వకముగా చేసిన పనులలో కొన్నించి విజయమును సాధించగలరు.విదేశీ ప్రయాణము భూ, గృహ సంబంధ ప్రయత్నములు ఫలించును.
చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఎలిన్నాటి శని కారణంగా తిప్పట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. అలోచించకుండా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. కొన్ని ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. డబ్బు విషయంలో ఎవరి చేతిలోనో మోసపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోకండి. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూల మైన సమాచారం అందుతుంది. అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు.వాహాది శుభకార్యములు నెరవేరుట, వాహన సౌఖ్యం, సంఘంలో పేరు, రాజకీయ నాయకులు పరిచయము, ప్రభుత్వం వారితో సఖ్యత, వ్యాపారమందు సంతృప్తి కలుగును. కోర్టు వ్యవహారాదులలో విజయం సాధిస్తారు. మాసాంతమున భాగస్వాములలో కలపాము, బంధువుల చికాకులు, ఆకస్మిక ప్రయాణములు, ధననష్టం కలుగును.
ఇవి కూడా చదవండి:
శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి