200మంది కార్మికులకు సన్మానం…

by Shyam |
200మంది కార్మికులకు సన్మానం…
X

సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాలప్రసాద్ ఆధర్యంలో శుక్రవారం భువనగిరిలోని 200మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల జీవన పరిస్థితిలపై సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నామని, డా, భీంరావ్ అంబేద్కర్, సంత్ రాందాస్, గురునానక్, స్వామి వివేకానందుల మార్గదర్శకం ప్రకారం వారి జీవితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సర్వే లోని అంశాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని సామాజిక సమరసత వేదిక ప్రయత్నం చేస్తుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed