- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ఇండ్ బ్యాంకుతో హోండా కార్స్ ఇండియా
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహాన తయారీ సంస్థ హోండా హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) వినియోగదారుల కోసం ఫైనాన్స్ స్కీమ్‌లు అందించేందుకు ఇండస్ఇండ్ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్ల ఫైనాన్సింగ్, చెల్లింపు అవసరాలను తీర్చేందుకు వీలవుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా హోండా మోడళ్ల కొనుగోలుపై తక్కువ ఈఎంఐ, అనుకూలమైన చెల్లింపులు, 100 శాతం ఎక్స్‌షోరూమ్ రుణాన్ని పొందడానికి వీలుతుందని కంపెనీ వివరించింది. ‘ఇండస్ఇండ్ బ్యాంకుతో ఒప్పందం ద్వారా వేతన, స్వయం ఉపాధి ఆదాయాన్ని కలిగి ఉన్న వినియోగదారులు వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేసేందుకు వీలవుతుందని’ హోండా సంస్థ పేర్కొంది.
పండుగ సమయంలో ఉండబోయే డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని వినియోగదారులకు మరింత సులభమైన చెల్లింపు ప్రయోజనాలను అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్‌సీఐఎల్ మార్కెటింగ్, సేల్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాజేష్ గోయెల్ అన్నారు. కాగా, కొవిడ్ మహమ్మారి పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లపై దృష్టి సారించాయి. వినియోగదారుల సౌకర్యాలను బట్టి వడ్డీ రేట్లు, రీపేమెంట్ వెసులుబాట్లను అందిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.