- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్ర దోపిడీదారులకంటే ఇంటి దొంగలే డేంజర్ : దుశ్చర్ల
దిశ,తెలంగాణ బ్యూరో: ఆంధ్ర దోపిడీదారుల కంటే ఇంటి దొంగలే డేంజర్ అని, కృష్ణా జలాలను కేంద్ర సహకారంతో దోచుకోవాలని చూస్తే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ అన్నారు. ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ‘కృష్ణా-గోదావరి జలాల ఆంధ్ర దోపిడీపై కేంద్ర పెత్తనం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులు ప్రొ.వినాయక్ రెడ్డి, నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ తేల్చిన నీటి వాట తాత్కాలికమైనదని కానీ, ఆంధ్ర ప్రభుత్వం హక్కుగా దోచుకొనే ప్రయత్నం చేస్తుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు.
పల్లె రవి కుమార్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలైన నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగునీరు లేకుండా చేసే కుట్ర జరుగుతుందన్నారు. కృష్ణ బేసిన్ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ అధ్యక్షుడు టీఎస్ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కృష్ణా గోదావరి నది జలాలపై గెజిట్ విడుదల చేసి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పటాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలలో నదీజలాలపై లేని కొత్త నిబంధనలు కేవలం తెలుగు రాష్ట్రాలపై ఏంటి మీ ఆజమాయిషి అని ప్రశ్నించారు.
ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఏల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఆపకపోతే లక్ష మందితో ఆ ప్రాజెక్ట్ లను కూల్చేస్తాం అని హెచ్చరించారు. తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ చైర్మన్ తన్నీరు వెంకటేష్ మాట్లాడుతూ కృష్ణ నది పరివాహక ప్రాంతంలో ఆంధ్ర నిర్మించిన ప్రాజెక్టులన్నీ అక్రమమే అన్నారు. ఇంజనీర్స్ ఇండియా చైర్మన్ డా.రమణ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు రవీందర్ నాయక్, అశోక్ యాదవ్, హాబిబ్ ఖాద్రీ, గడ్డం శ్రీనివాస్, చిరంజీవి బెస్త, అర్జున్ తోపాటు ప్రొఫెసర్లు, మేధావులు, నీటి రంగ నిపుణులు, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.