కర్నూలు వెళ్లారంటూ..ఏపీ బీజేపీ నేతకు హోం క్వారంటైన్

by srinivas |   ( Updated:2020-04-24 01:13:08.0  )
కర్నూలు వెళ్లారంటూ..ఏపీ బీజేపీ నేతకు హోం క్వారంటైన్
X

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. పరిధులు దాటి, నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని జరిమానాలు, శిక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లొచ్చినందుకు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు.

నాలుగు వారాలపాటు ఆయన గృహ నిర్బంధంలోనే ఉండాలంటూ అధికారులు ఆయన ఇంటికి నోటీసు అంటించారు. నోటీసు ధిక్కరించి బయటకు వెళ్తే కేసు నమోదు చేస్తామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. మరోవైపు, రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లొచ్చిన ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. కాగా, నోటీసు ఇచ్చేందుకు వెళ్తే విష్ణువర్ధన్ రెడ్డి లేరన్న సమాచారంతోనే ఆయన ఇంటికి నోటీసు అతికించాల్సి వచ్చిందని తహసీల్దార్ తెలిపారు.

ఇది రాజకీయ దుమారం రేపుతోంది. వైఎస్సార్సీపీ నేతలకు లేని ఆంక్షలు విపక్షాల నేతలకు మాత్రమే ఎందుకన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కరోనా ప్రభావం అధికంగా గల గుంటూరులో వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుటూ, వైజాగ్‌, విజయవాడలకు తిరుగుతున్న విజయసాయిరెడ్డిని ఎందుకు హోం క్వారంటైన్ చెయ్యలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Tags: ap bjp, bjp, vishnuvardhanreddy, home quarantain, police notice

Advertisement

Next Story

Most Viewed