హామీలన్నీ తూచ్.. తీవ్ర అసహనంలో హోంగార్డులు

by Shyam |
Home Guards
X

దిశ, క్రైమ్ బ్యూరో: పోలీస్​శాఖలో అత్యంత దిగువ శ్రేణి తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం హోంగార్డులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమవుతుంటే తమకు మాత్రం అవేవీ అందడం లేదని ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ యూనిఫాం సర్వీస్ కావడంతో డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని అడిగెంత సాహసం చేయలేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 వేల మంది హోంగార్డులు పని చేస్తున్నారు.

వీరితో 2017 డిసెంబర్‌లో సీఎం ప్రత్యేక సమావేశమై వారికి రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని, ప్రతి ఏడాది వెయ్యి రూపాయాలు వేతనం పెంచేలా చర్యలు తీసుకుంటామని, డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని, ఆరోగ్య భద్రత, హైదరాబాద్ నగరంలో పనిచేసే వారికి బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే 2021 నుంచి పెంచిన వేతనాలు, ప్రతియేటా రూ.1000 వేతనం పెంపుదల తప్ప మిగతావి ఏవీ కూడా అమలు కాలేదని, వాటిని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రభుత్వ పీఆర్సీ ప్రకటన వారికి కొంత ఉపశమనంగా మారనుంది.

Advertisement

Next Story

Most Viewed