- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో హోంగార్డు మృతి
by Shyam |
X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా ఓ కరోనా వారియర్ వైరస్ బారిన పడి మృతి చెందాడు. గురువారం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఆశ్వక్ అహ్మద్(35) అనే హోంగార్డు పరిస్థితి విషమించి మరణించాడు.
ఈయన నిజామాబాద్ రూరల్ పీఎస్‌లో ఆశ్వక్( 160 నెంబర్) హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఆయనకు పాజిటివ్ రావడంతో జనరల్ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే, జిల్లా వ్యాప్తంగా 15 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో ఒక సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐతో పాటు పలువురు కొవిడ్ బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా హోంగార్డు మృతితో పోలిస్ శాఖలో వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకునే పనిలో పడింది.
Advertisement
Next Story