ఇండియన్ కల్చర్‌పై ఇంట్రెస్ట్.. పాలిటిక్స్‌లోకి హాలీవుడ్ స్టార్

by Jakkula Samataha |
ఇండియన్ కల్చర్‌పై ఇంట్రెస్ట్.. పాలిటిక్స్‌లోకి హాలీవుడ్ స్టార్
X

దిశ, సినిమా : భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలపై మక్కువ చూపించే హాలీవుడ్ హీరో విల్ స్మిత్ పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయ్యారు. ‘పాడ్‌సేవ్ అమెరికా’ అనే పాడ్‌కాస్ట్‌లో రాజకీయ ప్రవేశం, జాత్యహంకారం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. కచ్చితంగా పాలిటిక్స్‌లో చేరడంపై ఓ అభిప్రాయం ఉందన్న విల్ స్మిత్.. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, సామాజిక సామరస్యాన్ని కలిగించేందుకు చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగమన్నారు. ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా రాజకీయాల్లోకి అడుగుపెడతానని స్పష్టం చేశారు.

యూఎస్‌లో నల్లజాతీయుడిగా పెరగడంపై అనుభవాలను పంచుకున్న విల్ స్మిత్.. తన మొహం మీదనే చాలా వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఐదారు సార్లు తిట్టారని తెలిపాడు. కానీ స్మార్ట్ పర్సన్స్‌ నుంచి అలాంటి పదాలు వినలేదన్నారు. రేసిస్ట్, రేసిజం అనేది మూర్ఖత్వమన్న హీరో.. వాళ్లు డేంజరస్‌గా ఉన్నప్పుడు తను కొంచెం స్మార్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తానెప్పుడూ జాత్యహంకారి కళ్లలోకి చూడలేదని, రేసిజమ్‌ను తెలివైన పనిగా భావించలేదని తెలిపారు. తాను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు సిస్టమెటిక్ రేసిజమ్ చూశానని, ఆ సమయంలో అజ్ఞానం, చెడుకు మధ్య తేడా గమనించానని చెప్పారు. అదృష్టవశాత్తు అజ్ఞానం చెడుకన్నా ఎక్కువ పాళ్లలో ఉందని, దీనికి విద్య మరియు అవగాహన ప్రక్రియ ద్వారా ఉపశమనం కలిగించవచ్చని, తద్వారా సమాజంలో మంచి మార్పు గమనించవచ్చని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed