- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైఖేల్ హోల్డింగ్‌కు ఉత్తమ పండిట్ అవార్డు
దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్‌కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ స్పోర్ట్స్ జర్నలిజం అవార్డు దక్కింది. గత ఏడాది ప్రపంచాన్ని తమవైపు తిప్పుకున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం సమయంలో హోల్డింగ్ చేసిన సహాయానికి, అతడి కృషికి గుర్తింపుగా ‘ఉత్తమ పండితుడు’ (బెస్ట్ పండిట్) అవార్డు ప్రకటించారు. ఏదైనా క్రీడలో అత్యుత్తమ సేవలతో పాటు, సామాజిక సంబంధ విషయాల్లో తోడ్పాటుగా ఉండే వారికి ఈ అవార్డు ఇస్తారు. 2020 ఏడాదికి గాను మైఖేల్ హోల్డింగ్ ఈ అవార్డు వరించింది. గత ఏడాది కరోనా మహమ్మారి సమయంలో బయోబబుల్ వాతావరణంలో విండీస్-ఇంగ్లాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ సమయంలో మైఖేల్ హోల్డింగ్ క్రీడల్లో జాతి వివక్షత గురించి పలు విషయాలను బయటపెట్టారు. బాధితులకు అండగా నిలిచారు. కాగా ఈ అవార్డు ప్రకటించడంపై హోల్డింగ్ హర్షం వ్యక్తం చేశారు. ‘నాలో ఎన్నో ఏళ్లుగా నిండిపోయిన బాధకు ఓదార్పుగా లభించిన అవార్డు. ఇది నిజంగా నాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని హోల్డింగ్ అన్నాడు.