మెట్రో నగరాల్లో నియామకాలు పెరిగాయ్

by Shyam |
మెట్రో నగరాల్లో నియామకాలు పెరిగాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెట్రో సిటీల్లో నియామక కార్యకలాపాలు అంతకుముందు నెలతో పోలిస్తే అక్టోబర్‌లో 5 శాతానికి పైగా పెరిగాయని తెలుస్తోంది. కొవిడ్-19 వ్యాప్తి ఆందోళనల నుంచి బయటపడుతూ ఇటీవల కార్యకలాపాలు మెరుగుపడటంతో అక్టోబర్‌లో పోస్టింగ్‌లు పెరిగాయని జాబ్ పోర్టల్ సంస్థ సైకీ తన నివేదికలో తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం, పండుగ సీజన్ ఉన్నప్పటికీ దేశీయంగా మెట్రో నగరాల్లో నియామక కార్యకలాపాలు కోలుకుంటున్న సంకేతాలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో జాబ్ పోస్టింగ్‌ల సంఖ్య 5.55 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, వార్షిక ప్రాతిపదికన నియామకాలు గత అక్టోబర్ కంటే 17.6 శాతం తగ్గాయి.

ప్రధానంగా ఈ-కామర్స్, ఫార్మా, ప్యాకేజింగ్, టెలికాం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ సంస్థల్లో అధిక నియామకాలు నమోదయ్యాయని డేటా అనలిటిక్స్ అండ్ కన్సల్టింగ్ సంస్థ వెల్లడించింది. మహమ్మారి నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ రంగం ముందుంది. అలాగే, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ కారణంగా టెలికాం రంగంలో నియామకాల పెరుగుదలకు దారితీసినట్టు నివేదిక పేర్కొంది. అయితే, కరోనా వల్ల పైస్థాయి ఉద్యోగాలు తగ్గాయని, తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కొంత మెరుగయ్యాయని సైకీ సహ-వ్యవస్థాపకుడు అక్షయ్ శర్మ చెప్పారు.

Advertisement

Next Story