హిందూ ఆలయాలపై వరుస దాడులు..

by srinivas |
హిందూ ఆలయాలపై వరుస దాడులు..
X

హిందూ ఆలయాలపై వరస దాడులు పెరిగిపోతున్నాయి.మొన్నఆదిలాబాద్‌లోని భైంసాలో హనుమాన్ ఆలయంపై దాడులు చేసి అందులోని హుండీలను ధ్వంసం చేశారు.దేవతల చిత్రపటాలపై పెట్రోల్ పోసి అంటించారు. నేడు పశ్చిమగోదావరి జిల్లా సూర్యారావు పాలెంలో అమ్మవవారి ఆలయ ముఖద్వారాన్నికొందరు దుండగులు కూల్చివేశారు.దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని కొండబిట్రగుంటలో వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి దుండగులు నిప్పుపెట్టారు.విషయం తెలుసుకున్న మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story