మత సామరస్యాన్ని చాటుతున్న ఇఫ్తార్ విందు

by vinod kumar |
మత సామరస్యాన్ని చాటుతున్న ఇఫ్తార్ విందు
X

దిశ, వెబ్ డెస్క్ : భిన్న మతాలకు, కులాలకు భారతదేశం పుట్టినిల్లు. మన దేశంలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచే సంఘటనలకు కోకొల్లలు. లాక్డౌన్ వేళ.. కులాలు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి పేదవారికి, అవసరమున్న వారికి సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సోదరులంతా ఉపవాసాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాల్లో వారికి ఇఫ్తార్ విందులిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అసోంలో చిక్కుకుపోయిన ఓ ముస్లిం యువకుడికి కూడా హిందూ కుటుంబం ఇఫ్తార్ విందు ఇచ్చి మతసామరస్యాన్ని చాటి చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లాక్డౌన్ వల్ల చాలా మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఎక్కడెక్కడో ఇరుక్కుపోయారు. కశ్మీర్ కు చెందిన ఓ ముస్లిం వ్యక్తి కూడా అసోంలోని మజులీలో చిక్కుకుపోయాడు. ప్రస్తుతం ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాసాలు దీక్షలు చేస్తున్నారు. దీంతో ఓ హిందూ కుటుంబం అతనికి ఇఫ్తార్ విందు ఇచ్చింది. అంతేకాదు ఆ వ్యక్తిని తమ ఇంట్లోనే నమాజ్ చేసుకోమన్నారు ఆ హిందూ దంపతులు. అయితే ఆ హిందూ దంపతులు, ముస్లిం వ్యక్తికి ఆహారం వడ్డిస్తున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు మరోసారి మన భారతదేశం.. మతసామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. జనతా కర్ఫ్యు నుంచి మే 3 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

tags :corona, lockdown, ramzan, iftar, muslim, harmony, story of humanity

Advertisement

Next Story

Most Viewed