హిందాల్కో త్రైమాసిక లాభం రూ. 668 కోట్లు!

by Harish |   ( Updated:2020-06-12 08:02:29.0  )
హిందాల్కో త్రైమాసిక లాభం రూ. 668 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ, అల్యూమినియం, రాగి తయారీ సంస్థ హిందాల్‌కో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికరలాభం 31 శాతం క్షీణించి రూ. 3,767 కోట్లకు తగ్గినట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 5,495 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం 9 శాతం తగ్గి రూ. 1.18 లక్షల కోట్లకు చేరిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.31 లక్షల కోట్లని కంపెనీ వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత నికర లాభం 43 శాతం తగ్గి రూ. 668 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,178 కోట్లని కంపెనీ పేర్కొంది. ఏకీకృత ఆదాయం 13 శాతం క్షీణించి రూ. 29,318 కోట్లకు చేరింది. అంతకుముందు ఇది రూ. 33,745 కోట్లుగా ఉంది. కంపెనీ ఈబీఐటీడీఏ(వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనానికి ముందు ఆదాయాలు) 6 శాత తగ్గి రూ. 4,173 కోట్లకు చేరుకున్నాయి. ఫలితాలపై హిందాల్కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ, ‘మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ మా ఈబీఐటీడీఏ మార్జిన్లు ఉత్తమంగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హిందాల్కో సానుకూలంగా ఉంది’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed