హిజ్రాలు హల్‌చల్.. పోలీస్ స్టేషన్‌లో బట్టలిప్పేసి హంగామా..

by Sampath |   ( Updated:2021-06-17 09:28:02.0  )
హిజ్రాలు హల్‌చల్.. పోలీస్ స్టేషన్‌లో బట్టలిప్పేసి హంగామా..
X

దిశ, అల్వాల్​: పెండ్లి వేడుకలో హిజ్రాలు బట్టలు విప్పి హల్​చల్​ చేసిన సంఘటన గురువారం నేరెడ్​​మెట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్​ నరసింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నగర్​లో నివాసం ఉంటున్న స్వరూప(40) కూరగాయల వ్యాపారం చేసుకుంటుంది. ఆమె కుమారుడి
వివాహం గురువారం ఇంట్లో జరుగుతుండగా.. ఇద్దరు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్​ చేయడంతో రూ.3 వేలు ఇచ్చి పంపించారు. తర్వాత మరో నలుగురు హిజ్రాలు మోక్ష, తమన్నా, సోనీలు వచ్చి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. డబ్బులు ఇవ్వమని చెప్పడంతో హిజ్రాలు దాడికి పాల్పడ్డారు.

అక్కడితో ఆగకుండా హిజ్రాలు బట్టలు విప్పేసి బూతులు తిడుతూ ఇంటిముందు వేసిన టెంట్​ కూల్చి కుర్చీలను ధ్వసం చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకుని హిజ్రాలను పోలీస్​స్టేషన్​కు తరలించారు. అక్కడకూడా ఆగకుండా నగ్నంగా పోలీసులను తిడుతూ హిజ్రాలు హల్​చల్​ చేశారు. దీంతో నలుగురు హిజ్రాలపై 506, 448 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్‌లో న్యూసెన్స్ క్రియేట్​ చేసినందుకు ఐపిసి 188,51(b)డిసాస్టర్​ మెనేజ్మెంట్​ కింద మరో కేసు నమోదు చేశారు

Advertisement

Next Story