- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యధికంగా సంపాదించే క్రీడాకారిణులు వీళ్లే
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే క్రీడాకారిణుల జాబితాను యూఎస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించింది. 2020గానూ ప్రకటించిన టాప్ 10 జాబితాలో 9 మంది టెన్నిస్ క్రీడాకారుణులే ఉండటం విశేషం. టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్న ఏకైక సాకర్ క్రీడాకారిణిగా అలెక్స్ మోర్గాన్ రికార్డు సృష్టించింది.
జపాన్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి నయోమీ ఒసాకా ఈ జాబితాలో టాపర్‌గా నిలిచింది. ఆమె ఏడాదికి 37.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.280 కోట్లు) సంపాదిస్తుండగా, సెరెనా విలియమ్స్ 36 మిలియన్ డాలర్లు (రూ. 269 కోట్లు) సంపాదనతో రెండో స్థానంలో నిలిచింది. ఒసాకా సంపాదనలో 10 మిలియన్ డాలర్లు కేవలం నైకీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల సంపాదిస్తుండటం గమనార్హం. గత ఏడాది జూన్ 1 నుంచి 2020 జూన్ 1 మధ్యలో సంపాదనను విశ్లేషించి ఫోర్బ్స్ ఈ జాబితాను సిద్దం చేసింది. ఇక యూఎస్ ఫుట్‌బాలర్ అలెక్స్ మోర్గాన్ ఏడాదికి రూ.35 కోట్ల వరకు సంపాదిస్తున్నది.
టాప్ 10 జాబితా:
1. నయోమీ ఒసాకా, టెన్నిస్ – 37.4 మిలియన్ డాలర్లు
2. సెరేనా విలియమ్స్, టెన్నిస్ – 36 మిలియన్ డాలర్లు
3. ఆష్లే బార్టీ, టెన్నిస్ – 13.1 మిలియన్ డాలర్లు
4. సిమోనా హెలెప్, టెన్నిస్ – 10.9 మిలియన్ డాలర్లు
5. బినాకా ఆండ్రెస్సీ, టెన్నిస్ – 8.9 మిలియన్ డాలర్లు
6. గర్బీన్ ముగురూజా, టెన్నిస్ – 6.6 మిలియన్ డాలర్లు
7. ఎలీనా స్వీతోలినా, టెన్నిస్ – 6.4 మిలియన్ డాలర్లు
8. సోఫియా కెనిన్, టెన్నిస్ – 5.8 మిలియన్ డాలర్లు
9. ఆంజిలీక్ కెర్బర్, టెన్నిస్ – 5.3 మిలియన్ డాలర్లు
10. అలెక్స్ మోర్గాన్, సాకర్ – 4.6 మిలియన్ డాలర్లు