ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు షాక్

by Anukaran |   ( Updated:2020-12-04 00:03:13.0  )
ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎలక్షన్ కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. గురువారం అర్ధరాత్రి ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ల పై స్వస్తిక్ మార్క్ తప్ప మిగతా ఏదైనా పెన్ను మార్కు, ఇంకు మార్కు ఉంటే వాటిని వాలిడ్ ఓట్లుగా పరిగణించరాదని ఎన్నికల సంఘానికి తేల్చిచెప్పింది.

కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. కాగా, బ్యాలెట్ పేపర్‌లో పెన్ను మార్క్‌ను కూడా ఓటుగా పరిగణిస్తామని ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ పై బీజేపీ పార్టీ శుక్రవారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పు పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed