వర్షాన్ని లెక్కచేయని కాంగ్రెస్ నేతలు.. దద్దరిల్లిన ఇందిరాపార్క్

by Shyam |   ( Updated:2021-07-22 02:18:55.0  )
Congress protest
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్‌ల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్​ పార్టీ నిరసనకు దిగింది. రాష్ట్రంలో భారీగా వర్షం కురుస్తున్నా.. ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి కాంగ్రెస్​శ్రేణులు భారీగా తరలివచ్చారు. జిల్లాల్లో పోలీసులు మళ్లీ ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో పోలీసుల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శాంతియుత నిరసనకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై మండిపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్​ కార్యకర్తలు, నేతలతో గాంధీభవన్, ఇందిరాపార్కు దగ్గర హడావుడి చోటుచేసుకుంది. గాంధీభవన్​ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్ అంజన్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, మహిళా నేతలు గాంధీభవన్ నుంచి ఇందిరాపార్కు దగ్గర వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

Congress protest

ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందని, సోనియా, రాహుల్ ఫోన్‌లను ట్యాప్ చేస్తూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్‌లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయన్నారు. నిరసన తెలపకుండా అడ్డుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓపిక నశిస్తే చెప్పకుండానే రాజ్‌భవన్ ముట్టడిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. టీపీసీసీ సీనియర్​ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. శాంతియుత నిరసనలు చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారని, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై నిరసనను అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో నిరసన తెలిపే హక్కును పాలకులు కాలరాస్తున్నారని ఆరోపించారు.

Congress protest

Advertisement

Next Story

Most Viewed