రాజు ఆత్మహత్యపై హైకోర్టు షాకింగ్ డెసిషన్

by Shyam |   ( Updated:2021-09-17 05:22:09.0  )
రాజు ఆత్మహత్యపై హైకోర్టు షాకింగ్ డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజు ఆత్మహత్యపై జ్యూడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వరంగల్ మూడో మెజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఏడుగురు సాక్ష్యాలను రికార్డు చేశామన్నారు.

Advertisement

Next Story