- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
దిశ, వెబ్డెస్క్ :
ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‍ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరికాదని మొట్టికాయలు వేసింది. ఎస్‍ఈసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ కు సహకరిచడం లేదని గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీకు ఇష్టం లేదని వ్యక్తిని తీసేస్తే అతనికి న్యాయబద్ధంగా పనిచేసే అవకాశం కల్పిస్తే.. మీరు ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది.
రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్టు పేర్కొంది. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ అని.. నిరంతరంగా పనిచేసేదని, వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‍ఈసీకి కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని సూచించింది. జస్టిస్ కనగరాజ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఈసీ చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది ఎస్ఈసీ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించింది. ఎస్‍ఈసీ నివేదికను బట్టి ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని.. లేదని పక్షంలో పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.