కరోనా బులెటిన్‌లో అవి లేవు: హైకోర్టు

by Anukaran |
కరోనా బులెటిన్‌లో అవి లేవు: హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసుల విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. కరోనా కేసుల విషయమై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. కరోనా కేసుల్లో తమ ఆదేశాలు అమలు కావడంలేదంటూ ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వెల్లడించింది.

జూన్ 8 నుంచి తాము జారీ చేసిన ఉత్తర్వుల్లో ఒక్కటి కూడా అధికారులు అమలు చేయడంలేదని సీరియస్ అయ్యింది. అమలు చేయడం కష్టమైతే ఎందుకో చెప్పాలని సూచించింది. నిన్నటి బులెటిన్ లో కూడా సరైన వివరాలు లేవని ఆగ్రహించింది. ఏం చేయమంటారో రేపు సీఎస్ నే అడుగుతామంటూ సీరియస్ అయ్యింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed