- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సర్కార్‌కు ఊహించని షాక్.. ‘ధరణి’పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్ అత్యద్భుతం. పారదర్శకంగా భూ పరిపాలనను కొనసాగిస్తున్నాం. అక్రమాలు, అవినీతికి తావులేని వ్యవస్థను రూపొందించడాన్ని అందరూ ప్రశంసిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్ అన్నారు. కానీ, ఆ ధరణి పోర్టల్ అమలు చేయడమంటే చట్టాలను ఉల్లంఘించడమేనని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రిజిస్ట్రేషన్ చట్ట సవరణ చేయకుండానే వ్యవసాయ భూముల క్రయ విక్రయాలపై అధికారాలను తహసీల్దార్లకు కట్టబెట్టడమేమిటని ప్రశ్నించింది.
ధరణి పోర్టల్, ఆర్వోఆర్ చట్టాల అమలు ద్వారా లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రికార్డులను సవరించే వ్యవస్థ లేకుండా అమలు చేయడమంటే న్యాయం పొందే హక్కును కాలరాస్తున్నారని న్యాయవాదులు వాణి, అభిలాష్‌లు చీఫ్ జస్టిస్ సతీష్ కుమార్ శర్మకు వివరించారు. ఎక్కడైనా రికార్డులను తయారు చేసే వారికి మాత్రమే వాటిని సరిదిద్దే అధికారం ఉంటుంది. ఆర్వోఆర్ 1971 చట్టంలోనూ రికార్డులను సరిదిద్దే అధికారం తహసీల్దార్లు, ఆర్డీఓలకు కట్టబెట్టారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఆర్వోఆర్ చట్టాలను సవరించే అధికారం ఉంటుంది. రికార్డులను తప్పులుగా నమోదు చేసి రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నారని వారు వాదించారు. భూమి ఉండి హక్కుల్లేకుండా చేయడం వల్ల రైట్ టూ ఈక్వాలిటీకి భంగం కలుగుతుందన్నారు.
ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి వివిధ మాడ్యూల్స్ ఉన్నాయని ప్రభుత్వం భావించినా.. దరఖాస్తు చేసుకుంటే అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ చట్టం ప్రకారం కలెక్టర్లు సవరిస్తున్నారని పిటిషన్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సరిదిద్దే అధికారం ఎవరికి, ఎలా అప్పగించారన్నారు. ఈ క్రమంలో కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర ఏడు రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను ఉటంకించారు. అక్కడ భూమి హక్కులపై అభ్యంతరాలను స్వీకరించి ఎలా పరిష్కరిస్తున్నారో పిటిషన్‌లో వివరించారు. పైగా సివిల్ కోర్టుకు వెళ్లమని రైతులపై ఒత్తిడి చేయడం సరైంది కాదన్నారు.
భూ యాజమాన్య హక్కులపై మాత్రమే కోర్టులకు వెళ్తారని, ప్రతీ దానికి కోర్టుకే వెళ్లాలంటూ రెవెన్యూ యంత్రాంగం ఆదేశిస్తుండటం కూడా మానవ హక్కుల ఉల్లంఘనగా పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదించారు. ఏదేమైనా సరిగ్గా తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 అమలైన ఏడాదికి హైకోర్టులో వాదనలు జరగడం గమనార్హం. పైగా ఏ చట్ట సవరణ చేయకుండా అమలుచేయడం పట్ల హైకోర్టు ఆక్షేపించడం చర్చనీయాంశం. ఇప్పటికే లక్షలాది మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.